వైసీపీ ని ఎదుర్కోవడానికి ఇదే బెటర్ అట ..?

యుద్ధం చేయకుండా గెలవడం ఎలా ? దీనికి కొత్త దారి వెతికేసింది ఏపీ లోని ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ. అధినేత మొన్నటి స్థానిక ఎన్నికల్లో చూపించిన [more]

Update: 2021-08-05 14:30 GMT

యుద్ధం చేయకుండా గెలవడం ఎలా ? దీనికి కొత్త దారి వెతికేసింది ఏపీ లోని ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ. అధినేత మొన్నటి స్థానిక ఎన్నికల్లో చూపించిన మార్గమే ఇప్పుడు క్రింది స్థాయిలో అమలు చేయడమే బెటర్ అనుకుంటున్నారు నేతలు. వైసీపీ హవా ముందు జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ప్రతీ ఎన్నికల్లో కురిపిస్తున్న ఓట్ల వర్షం ప్రధాన విపక్షానికి అర్ధం అయిపొయింది. దాంతో తాము ఈ అక్రమ ఎన్నికల్లో తప్పుకుంటున్నాం అంటూ పంచాయితీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో చేతులెత్తేసింది టిడిపి.

కాకినాడ లో అదే ఫార్ములా …

కాకినాడ కార్పొరేషన్ లో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ముందు తెలుగుదేశం ఈ పోటీ లో తాము లేమంటూ తెల్లజండా చూపించేసింది. వాస్తవానికి 2017 లో నిర్వహించిన నాటి కార్పొరేషన్ పాలకవర్గ ఎన్నికల్లో టిడిపి దుమ్ము రేపింది. 48 స్థానాలకు 32 సీట్లు గెలిచింది. ఇక్కడ 10 స్థానాల్లోనే వైసిపి గెలిచింది. అయినప్పటికీ ఈ స్థానంలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగితే కార్పొరేటర్ లు మెజారిటీ వైసీపీ కి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే కాకినాడ లో అంతో కొంత పట్టు ఉందని చెప్పుకోవడానికి సైతం ఆ పార్టీకి ఏమీ లేకుండా పోతుంది. దాని బదులు బలం లేకపోయినా వైసీపీ కే రెండో డిప్యూటీ మేయర్ అప్పగించడమే ఉత్తమం అనే మార్గాన్నే ఆ పార్టీ ఎంచుకోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

గడ్డుకాలమే ఇక …

ఏపీ లో ఇప్పుడు ఏ ఎన్నికలు రాకుండా ఉండాలని టిడిపి గట్టిగా కోరుకుంటుంది. ఒక వేళ వస్తే తమ పరిస్థితి మరింత దిగజారుతుందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల విపక్షాలకు సీన్ లేదన్న సందేశం బలంగా పోతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. స్థానిక ఎన్నికల వంటివి ఎక్కడైనా జరిగి కొద్ది స్థానాల్లో అయినా కార్పొరేటర్ లు, కౌన్సిలర్లు, లేదా వార్డ్ మెంబర్లు వంటివారు విపక్షానికి చెందిన వారు గెలిచినా వెంటనే వైసీపీ లోకి దూకేస్తున్నారు. దాంతో అదేదో తామే అధికారపక్షాన్ని గెలిపించుకుని పనులు చేయించుకోవొచ్చు అనే ఆలోచనతో ఒకటి అర నెగ్గే స్థానాలను విపక్షాలు కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో టిడిపి సంగతి ఎలా ఉన్నా జనసేన, బిజెపి వంటి పార్టీలు మరీ బలహీనపడిపోతున్నాయి.

Tags:    

Similar News