కక్ష సాధింపు…అంటే…?

కొన్ని పదాలు ఎవరికీ అర్ధం కావు. అవి బ్రహ్మ పదార్ధం లాంటివి అన్న మాట. కేవలం తమకు అనుకూలంగా రాజకీయ జీవులు వాడేసుకునే పదాలు అవి. పాలిటిక్స్ [more]

Update: 2020-10-17 02:00 GMT

కొన్ని పదాలు ఎవరికీ అర్ధం కావు. అవి బ్రహ్మ పదార్ధం లాంటివి అన్న మాట. కేవలం తమకు అనుకూలంగా రాజకీయ జీవులు వాడేసుకునే పదాలు అవి. పాలిటిక్స్ లో ఎక్కువగా వినిపించే పదం కక్ష సాధింపు. నిజానికి కక్షలు, కార్పణ్యాలూ ముఠా నాయకుల మధ్యన ఉంటాయి. రాజకీయ పార్టీలకూ, వాటి జీవులకు ఎందుకు ఉంటుంది. పైగా అధికారంలోకి ఎవరు వచ్చిన సొమ్ము ప్రజలది, కేవలం ధర్మకర్తలుగా మత్రమే ఏలికలు ఉంటారు. అది కూడా అయిదేళ్ల కాల వ్యవధికి మాత్రమే. మళ్లీ ప్రజా తీర్పు వస్తే వస్తే రాజు ఎవరో. తరాజు ఎవరో. ఇక ప్రజల సొమ్ముకి బాధ్యత తీసుకున్న్ వారు ప్రశ్నిస్తే తప్పు చేసిన కక్ష అంటే ఎలా…?

రివర్స్ అటాక్ మూడ్ లో…..

నిజానికి మన నాయకులు చాలా తెలివైన వారు. తప్పులు తాము చేసి సింపతీని మాత్రం జనం నుంచి కోరుకుంటారు. అధికారంలో ఉండగా హవా ఒక్క లెక్కన సాగిపోతుంది. నిబంధనలను నీళ్లు వదిలేసి మరీ బరితెగిస్తారు. తీరా పవర్ లోకి నుంచి ప్రతిపక్షంలోకి పడ్డాక ఎవరైనా ఆ తప్పుని కెలికితే మాత్రం కక్ష సాధింపు అంటారు. అలా పడికట్టు పదాఅను నోట్లోనే వల్లె వేస్తారు. ఇపుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు విపక్ష తెలుగుదేశానికి కక్ష సాధింపుగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రతిపక్షాలను వేధిస్తోందిట. అదే నిజం అనుకుంటే కమ్యూనిస్టుల జోలికి కానీ కొత్తగా పార్టీ పెట్టిన పవన్ జనసేన జోలికి కానీ వైసీపీ ఎందుకు పోవడంలేదు. వారు కూడా జగన్ ని బాగా విమర్శిస్తున్నారు కదా.

అధారాలు ఉంటేనే …..

తాజాగా రాయలసీమ పెద్దాయన జేసీ దివాకరరెడ్డి జగన్ సర్కార్ మీద పడి గట్టిగానే ఏడుస్తున్నారు. జగన్ కి ఆయన శాపనార్ధాలే పెడుతున్నారు. అనవసరంగా అమాయకులమైన జేసీ సోదరులను తెగ బాధపెడుతున్న శాడిస్ట్ ప్రభుత్వం అని కూడా తిట్ల పురాణం అందుకుంటున్నారు. ఇంతకీ జేసీ బ్రదర్స్ కి జగన్ చేసిన అన్యాయం ఏంటి అని ఆరా తీస్తే అక్రమంగా బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకరరెడ్డి అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. ఈ కేసులో ఆయన అనుచరులే రివర్స్ అయి అప్రూవల్స్ గా మారి సాక్ష్యాలు ఇవ్వడంతో ప్రభాకరరెడ్డికి ఉచ్చు గట్టిగా బిగుసుకుంది. ఇక తాజాగా జేసీ దివాకరరెడ్డి గనుల్లో అక్రమాల మీద కూడా విచారణ చేస్తున్నారు. నిజంగా ఏ అక్రమం లేకపోతే ప్రభుత్వం కేసులు పెట్టినా కోర్టులు కొట్టేస్తాయి కదా. ఆ మాత్రం దానికి కిందా మీదా జేసీ సోదరులు ఎందుకు అవుతున్నారు అన్నదే ప్రశ్న. అంటే ఇక్కడ అక్రమాలు జరిగాయని వారికీ తెలుసు. ఇన్నాళ్ళూ వారి జమానా నడచింది. ఊరుకున్నారు. ఇపుడు జగన్ సర్కార్ ఈ విషయంలో ముందుకు వెళ్తోంది. అందుకే ఏడుపులూ పెడబొబ్బలూ అంటున్నారు.

అన్నీ అలాంటివేగా…?

ఏ కేసు అయినా ఫైల్ చేస్తే కక్ష సాధింపు అనడం టీడీపీకి అలవాటు అయిపోయిందని అంటున్నారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు విషయంలో అయినా, కొల్లు రవీంద్ర విషయంలో అయినా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటే విషయం కొంత ఉంది అన్నది అర్ధమవుతోంది కదా. ఇక ఇదే తీరున ఏపీలో ఏ పెద్ద టీడీపీ లీడర్ విషయంలో దర్యాప్తు చేసినా కక్ష అంటున్నారు. ఏకంగా అమరావతి రాజధాని భూ దందా విషయంలో కూడా ఇదే మాట. అక్కడ దందా జరగలేదని ఆ గట్టునే ఉన్న బక్క రైతును చెప్పమన్నా మొత్తానికి మొత్తం చెబుతాడు. మరి ఇవన్నీ విచారణ చేయకూడదు అంటున్నారు. దీని మీద ఒక సామాజికవర్గానికి చెందిన మేధావులు అనబడే వారి నోట కూడా ఇదే మాట. జగన్ కక్ష సాధింపులు కట్టిపెట్టి ముందుకు సాగాలట. ఏపీ అన్ని విధాలుగా వట్టిపోయింది. ఆదాయ మార్గాలు లేవు. తొలి ప్రభుత్వం వచ్చి అయిదేళ్ళలో అంతా గోకేసి వెళ్ళిపోతే ఖజానాకు చిల్లు పడిందని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఎక్కడ నుంచి డబ్బు వస్తుంది. కనీసం నిబంధనలు అమలు చేసి ప్రభుత్వ శాఖలకు ఆదాయం తెద్దామంటే కక్ష సాధింపు ముద్ర వేస్తే ఎలా. ఇంతకంటే నాయకులు తమ బతుకులు దాచుకునేందుకు తెలుగులో వేరే మాట దొరకలేదా. ఇది రాష్ట్ర హితం కోరుకుంటున్న వారి నుంచి వస్తున్న మాట.

Tags:    

Similar News