దారి లేదు అందుకే జండా పీకేశారు ?

సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన రావు లు పేరు చెబితే చాలు టిడిపి లో శ్రేణులు లేచి నిలబడేవి. ఒక్క టిజి వెంకటేష్ ను [more]

Update: 2019-06-21 03:08 GMT

సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన రావు లు పేరు చెబితే చాలు టిడిపి లో శ్రేణులు లేచి నిలబడేవి. ఒక్క టిజి వెంకటేష్ ను మినహాయిస్తే చంద్రబాబు ఈ ముగ్గురిని నమ్ముకుని పార్టీ తాళాలు మొత్తం అప్పగించేశారు. టిడిపి ఆర్ధిక మూలస్తంభాల్లో ఈ ముగ్గురు వహించే పాత్ర అంతా ఇంతా కాదు. ఢిల్లీ వ్యవహారాలు వ్యాపారాలు అన్ని చక్కబెట్టే పని గరికపాటి ది అయితే, సుజనా చౌదరి పార్టీకి అవసరమైన ఆర్ధిక భారాన్ని మోస్తూ ఉండేవారు. ఇక సిఎం రమెష్ ఇంటిపేరుకు తగ్గట్టే టిడిపి సర్కార్ లో బినామీ అనే పేరు తెచ్చుకున్నారు. ఎపి లో భారీ ప్రాజెక్టులన్నీ ఆయనే దక్కించుకున్నారు ఆరోపణలను స్వయంగా బిజెపి నే చేసింది. ఆయన కాదంటే నే ఏ ప్రాజెక్ట్ అయినా వేరే వారికి వెళ్ళే పరిస్థితి నడిచేది.

ఎన్నికల ముందు నుంచి గడ్డుకాలమే …

ఎన్నికల ముందు నుంచి ఎన్డీయే లోనుంచి బయటకు వచ్చాకా సిఎం రమేష్, సుజనా చౌదరి లక్ష్యంగా ఐటి దాడులు , ఈడి దాడులు వంటివి మొదలయ్యాయి. ఏపీలో అధికారం కోల్పోయాక ఈ దాడులకు తోడు వీరిపై అభియోగాలను పూర్తిగా తిరగతోడుతున్న జగన్ సర్కార్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒక పక్క మోడీ సర్కార్ పగబట్టి, మరో పక్క సొంత రాష్ట్రంలో కూడా గడ్డు పరిస్థితులను ఒకేసారి ఎదుర్కోవడం సాధ్యం కాదనే నిర్ణయాన్ని ఆ నలుగురు తీసుకున్నట్లు టిడిపి వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. హాయిగా ఆఫర్ ఇస్తున్న కమలం చెంతన చేరితే తిరిగి దేశంలో తమ వ్యాపార లావాదేవీలకు తిరుగుండదని ఈ విషయాన్ని వారం క్రితమే చంద్రబాబు కు చెప్పే బై బై బాబు కు రంగం సిద్ధం చేసుకున్నట్లు అంతా విశ్లేషకుల అనుమానం. తాను విదేశాలకు వెళ్ళాకా మీరు చక్కేయండని దానివల్ల ఎంతోకొంత టిడిపికి సానుభూతి పెరుగుతుందని బాబు ముహూర్తం ఫిక్స్ చేశారని హస్తినలో ప్రచారం. గతంలో రేవంత్ రెడ్డి అంశంలోనూ చంద్రబాబు ఇదే దారిలో కాంగ్రెస్ కు చేర్చారని గుర్తు చేస్తున్నారు కొందరు.

మేము ఎప్పటికి బాబు విధేయులమే …

అందుకే రాజ్యసభలో తమ పార్టీని విలీనం చేసేశామని ప్రకటించిన సుజనా చౌదరి ఎప్పటికి తామంతా చంద్రబాబు విధేయులమేనని పరిస్థితుల రీత్యా జండా పీకేశామని చెప్పుకొచ్చారు. ఏపీలో టిడిపి ని పెకలించి తమ జండా ఎగురవేస్తామని వైసిపి కి ప్రత్యామ్నాయం తామే అని కమలనాధులు కలలు కంటూ ఉంటే మరోపక్క తాజాగా కండువా కప్పుకున్న సుజనా టిడిపి ఏపీలో బాగుపడాలని కోరుకుంటున్నా అని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కేసుల బారిన పడకుండా షెల్టర్ జోన్ గా సుజనా అండ్ బ్యాచ్ బిజెపిని వాడేసేందుకు ఫిరాయింపు అన్నది చెప్పక చెప్పినట్లే అయ్యింది.

Tags:    

Similar News