చినబాబును తప్పించగలరా ?

తెలుగుదేశం పార్టీనిమామ నందమూరి తారకరామారావు నుంచి లాక్కుని నారా వారి పార్టీగా మార్చిందే అందుకు. తాను, తరువాత వారసుడు ఇలా నారా వంశం సంపూర్ణంగా టీడీపీకి అధినాయకత్వం [more]

Update: 2019-06-23 02:30 GMT

తెలుగుదేశం పార్టీనిమామ నందమూరి తారకరామారావు నుంచి లాక్కుని నారా వారి పార్టీగా మార్చిందే అందుకు. తాను, తరువాత వారసుడు ఇలా నారా వంశం సంపూర్ణంగా టీడీపీకి అధినాయకత్వం వహించాలని చంద్రబాబు నాయుడు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే బాబు వరకూ ఒకే కానీ నారా లోకేష్ ని వారసుడిగా ఒప్పుకోమని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు ఉన్న దీక్షాదక్షతలు లోకేష్ కి ఏ మాత్రం లేవని, ఆయన్ని ముందు పెట్టి జై కొట్టమంటే కుదిరే పని కాదని ఖరాఖండీగా చెప్పేస్తున్నట్లుగా భోగట్టా. మరి నారా వారి చేతుల్లో నుంచి టీడీపీ బయటకు పోకూడదన్నది చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదల. చూడబోతే తమ్ముళ్ళే ఎదురుతిరుగుతున్నారు. మరి ఈ కధ ఎటు సాగుతుందోనని బాబు కంగారు పడుతున్నట్లుగా టాక్.

ఆయన్ని పక్కకు పెట్టాల్సిందే :

నారా లోకేష్ వల్లనే తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు అయిందని మెజారిటీ పార్టీ నాయకులు అంటున్నారు. ఏ విధంగానూ సామర్ధ్యం లేని లోకేష్ ని మా నెత్తిన ఎక్కించొద్దు అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు కే అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలంతా కలసి ఒక చోట సమావేశమై ఈ డిమాడ్ చేసినట్లు భోగట్టా. పార్టీలో తాము బలంగా ఉండాలని, కీలకమైన పదవులు తమకే దక్కాలన్నది వారి కోరికగా ఉంది. అదే సమయంలో సొంత సామాజికవర్గం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నారా లోకేష్ ని పక్కన పెడితేనే పార్టీ బాగుపడుతుందని వారు సూచిస్తున్నారు.

అది జరిగేపనేనా :

నిజానికి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు రాజకీయాలు చేయాలి అంటే కేవలం నారా లోకేష్ కోసమేనన్నది అందరికీ తెలిసిందే. మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఈ వయసులో రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. తన రాజకీయ అనుభవం అంత వయసు ఉన్న జగన్ తో పోటీ పడుతూ ఉరకలు పరుగులు ఎత్తాల్సిన అవసరం అంతకంటేలేదు. 2024 నాటికి టీడీపీ అధికార పగ్గాలు చేపడితే టీడీపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యేది నారా లోకేష్ అనడంతో సందేహం లేదు. మరి అటువంటి లోకేష్ ని పార్టీ నుంచి పక్కకు పెడితే అసలు టీడీపీ రాజకీయమే అనవసరమని బాబు బావిస్తారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ రకమైన కొరుకుడు పడని డిమాండ్ పెట్టి మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో ఉంటారా జెండా ఎగరేస్తారా అన్నదే తమ్ముళ్లకు డౌట్ గా ఉంది.

Tags:    

Similar News