వైసీపీలో చేరేందుకు రెడీ.. బాబు వైఖరి నచ్చకేనట

టీడీపీ అధినేత, మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచిన మాజీ మంత్రి, [more]

Update: 2020-04-03 08:00 GMT

టీడీపీ అధినేత, మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో గెలిచిన మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన గుమ్మడి కుతూహ‌ల‌మ్మ.. తాజాగా జ‌గ‌న్ చెంత‌కు వ‌చ్చేందుకు మార్గం సుగ‌మం చేసుకుంటున్నారు. ఇప్పటికే చ‌ర్చలు కూడా పూర్తయ్యాయ‌ని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైర‌ల్ అవుతోంది. విష‌యంలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన కుతుహలమ్మ వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్టర్‌. ప్రభుత్వ వైద్యశాల‌లో ఉద్యోగం. అయితే, 1980లో ఆమె రాజ‌కీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 1981లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబునాయుడు కుతుహలమ్మను జిల్లా పరిషత్ ఛైర్మన్ ను చేయడంలో కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ లో కొనసాగినా…..

1985, 1989, 2004లలో వేపంజేరి నియోజకవర్గం నుండి కుతూహలమ్మ విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో వేపంజేరి నియోజకవర్గం స్థానంలో గంగాధర నెల్లూరు స్థానం ఏర్పాటైంది. దీంతో ఈ స్థానం నుండి కుతుహలమ్మ విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. సోనియాగాంధీ చొరవతో కుతుహలమ్మ కు 2009లో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. వైఎస్ మరణించిన తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కుతుహలమ్మకు చోటు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని కుతుహలమ్మ భావించారు. కొడుకు హ‌రికృష్ణను రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే ప్రాధాన్యత ఉండదని భావించి 2014 ఎన్నికలకు ముందుగా టీడీపీలో చేరారు.

టీడీపీలో చేరినా…..

ఆ ఎన్నిక‌ల్లో చంద్రబాబుతో త‌న‌కు ఉన్న పాత ప‌రిచయాల‌ను వాడుకుని త‌న కుమారుడికి సీటు కావాల‌ని అడ‌గ్గా చంద్రబాబు మాత్రం మీరు పోటీ చేస్తేనే సీటు ఇస్తాన‌ని చెప్పడంతో ఆమె 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. టీడీపీలోనూ ఆమెకు ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు టికెట్ ఇచ్చి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేయించినా.. క్షేత్రస్థాయిలో నాయ‌క‌త్వం కుతూహ‌ల‌మ్మకు అనుకూలంగా ప‌నిచేయ‌లేదు. దీంతో ఆమె ఓడిపోయారు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి కుమారుడికి గంగాధ‌ర నెల్లూరు టికెట్ ఇప్పించుకున్నా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. దీంతో అప్పటి నుంచి పార్టీకి, చంద్రబాబుకు కూడా దూరంగా వున్నారు.

జగన్ పై ప్రశంసలు….

ఇక‌, టీడీపీకి ఇప్పట్లో ఫ్యూచ‌ర్ లేద‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన కుతూహ‌ల‌మ్మ కుటుంబం వైసీపీకి చేరువ కావాల‌ని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గ‌తంలో వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాల‌ను ఉటంకిస్తూ.. కొన్నాళ్లుగా జ‌గ‌న్ పాల‌నపై ప్రశంస‌ల జ‌ల్లు కురిపిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో ఆమె కుటుంబం వైసీపీలోకి చేరే విష‌యంలో వైసీపీ నేత‌ల అభిప్రాయం భిన్నంగా ఉంది. వీరికి ప్రజా బ‌లం లేద‌ని, వ‌చ్చినా పార్టీకి ఎలాంటి ప్రయోజ‌నం లేద‌ని అంటున్నారు. అలాగే గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. దీంతో ఇప్పుడు కుతూహ‌ల‌మ్మ కుటుంబాన్ని చేర్చుకోవ‌ద్దని ఆ వ‌ర్గం చెపుతోంది. మ‌రి వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News