స్పీకర్ ఎలా ఉండాలో సుద్దులు చెబుతున్న అచ్చెన్న

నిజమే ఈ సుద్దులు తెలుగుదేశం పార్టీ మాత్రమే చెప్పాలి. వారికే బాగా  అనుభవం ఉంది కాబట్టి. విభజన ఏపీలో తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ స్పీకర్ [more]

Update: 2019-09-10 11:00 GMT

నిజమే ఈ సుద్దులు తెలుగుదేశం పార్టీ మాత్రమే చెప్పాలి. వారికే బాగా అనుభవం ఉంది కాబట్టి. విభజన ఏపీలో తొలి స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ స్పీకర్ వ్యవస్థను ఎంతలా దిగజార్చారో అందరికీ తెలిసిందే. ఆయన ఫక్త్ రాజకీయ నాయకునిగా మారిపోయి టీడీపీ సభల్లో కనిపించేవారు. అంతే కాదు పార్టీ ఇచ్చిన ప్రతీ రాజకీయ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకునే వారు. తెలుగుదేశం పార్టీ గెలవాలని కూడా పిలుపు ఇచ్చేవారు. ఇక చివరి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కోడెల మాట్లాడుతూ మళ్లీ మీరే సీఎం గా ఇదే సభలో రావాలని, మేము చూడాలని కూదా కోరుకున్నారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యెలను టీడీపీ చేర్చుకుంటే ఏ చర్యా తీసుకోకుండా అధికార టీడీపీకి కొమ్ము కాసిన కోడెల మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ని ఓ రాజకీయ నేత మాదిరిగా విమర్సించేవారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని పూర్తిగా కోడెల మరచిపోయిన సందర్భాలు అవి. ఇపుడు టీడీపీ లెజిస్లేటివ్ పార్టీ ఉప నాయకుడు కింజరపు అచ్చెన్నాయుడు స్పీకర్ వ్యవస్థను తమ్మినేని సీతారాం పాడుచేస్తున్నారని తెగ బాధపడుతున్నారు.

రాజకీయలు వద్దట :

తమ్మినేని స్పీకర్ గా ఉండాలి తప్ప రాజకీయాలు మాట్లాడడం ఏంటని అచ్చెన్న గుస్సా అవుతున్నారు. ఆయనకు ఆ అవసరం ఏముందని కూడా ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ పదవి ఉన్నతమైనదని, రాజకీయాలకు అతీతమైనదని కూడా నీతులు వల్లిస్తున్నారు. తమ్మినేని పట్ల తనకు గౌరవం ఉందని చెబుతూనే అచ్చెన్న ఆయన వైఖరి మంచిది కాదని ఘాటుగా విమర్శలు చేశారు. తమ్మినేని తనను ఓ నాయకుడు మాదిరిగా విమర్శించడమేంటని కూడా నిలదీశారు. తమ్మినేని స్పీకర్ గా ఉండాలని, ఆయన రాజకీయాలకు దూరంగా జరగాల‌ని కూడా అచ్చెన్న కోరారు.

ఇదీ అసలు కధ :

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కుమ్మకు, అవగాహనతో పార్టీలకు అతీతంగా అంతా నడుస్తున్నారన్నది తెలిసిందే. వైసీపీకి చెందిన జిల్లా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ ఉండగా అచ్చెన్న స్పీకర్ ని పట్టుకుని విమర్శలు చేయడమేంటన్నది చర్చగా ఉంది. క్రిష్ణదాస్ పైన బాణాలు ఎక్కుపెట్టేందుకు ఏ రకమైన మొహమాటాలు అడ్డొచ్చాయో తెలియదు కానీ అచ్చెన్న పెద్ద నోరు వేసుకుని మరీ తమ్మినేనిని అంటున్నారు. స్పీకర్ ఎలా ఉండాలో చెప్పిన అచ్చెన్న తాను స్పీకర్ ని విమర్శించకూడదన్నది తెలియదా అని తమ్మినేని వర్గీయులు అంటున్నారు. అచ్చెన్న స్పీకర్ ని మాటలు అనడమే కాదు సవాల్ చేయడమేంటని కూడా నిలదీస్తున్నారు. తమ్మినేని విలువలతో కూడిన రాజకీయం చేస్తారని, ఆయన కొడెల మాదిరిగా స్పీకర్ వ్యవస్థను భ్రష్టు పట్టించరని కూడా చెబుతున్నారు. మొత్తానికి అచ్చెన్న రాజకీయ బాణాల వల్ల శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తమ్మినేని ఎంతటి పవర్ ఫుల్ అన్నది అర్ధమవుతోందని కూడా ఆయన వర్గీయులు అంటున్నారు.

Tags:    

Similar News