సొంతింట్లో ఇక సాధ్యంకాదా?

పొరుగింటి పుల్లటి కూరపై ఉన్న ఆసక్తి.. సొంత ఇంటి పై ఉండదని అంటారు. అచ్చు అలాగే మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరించారని అంటున్నారని అంటున్నారు [more]

Update: 2019-08-10 00:30 GMT

పొరుగింటి పుల్లటి కూరపై ఉన్న ఆసక్తి.. సొంత ఇంటి పై ఉండదని అంటారు. అచ్చు అలాగే మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరించారని అంటున్నారని అంటున్నారు చిత్తూరు జిల్లాలోని టిడిపి నేతలు. ఆయనకు అప్పటి ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాపై ఉన్న ఆసక్తి.. తన సొంత జిల్లాపై లేదని, అందుకే తాము ఇప్పుడు తిప్పలు పడుతున్నామని అంటున్నారు. ఇంట్లో దీపం వెలిగించలేని నాయకుడు పక్కింట్లో పెట్రోమాక్స్ లైట్‌ వెలిగిస్తాన‌న్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారని ఇప్పుడు వ్యాఖ్యలు సంధిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేదే….

విషయంలోకి వెళ్తే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం చంద్రబాబు మినహా ఏ ఒక్కరు విజయం సాధించకపోవడం గమనార్హం. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేకపోవడంతో తమ్ముళ్లు నివ్వెర పోతున్నారు అదే సమయంలో ఇదంతా స్వయం కృతమ‌ని పరోక్షంగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి నేతలను స్వాగతించారు చంద్రబాబు. అయితే, అదే సమయంలో పార్టీ కోసం కృషి చేసిన వారిని, అప్పటివరకు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారిని ఆయన పక్కన పెట్టి కొత్తవారికి పట్టంకట్టారు.

పనిచేసిన వారికి చులకనగా….

ఇలా చాలా నియోజకవర్గాల్లో తమ్ముళ్లను చులకన చేశారనే భావన మెండుగా వినిపిస్తుంది. పలమనేరు, పుంగనూరు, పీలేరు వంటి స్థానాల్లో అప్పటివరకు పార్టీ కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టారు. ఇక, నగరిలో టికెట్ కోసం తన్నుకున్న గాలి ముద్దుకృష్ణమ‌ కుటుంబాన్ని సమన్వయం చేయడంలోనూ బాబు విఫలమయ్యారు. శ్రీకాళహస్తిలో బొజ్జల కుటుంబానికి టికెట్ ఇచ్చినా.. వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లలేక పోయారు. తిరుపతి సీటును అలానే చేశారు. ఇక చంద్రగిరిలో వేసిన అడుగు మరింత వివాదమై.. చివరికి కొన్ని పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ వరకు విషయం వెళ్ళింది. ఇంత జరిగినా కూడా.. టిడిపి సాధించింది కేవలం ఒకే ఒక్క సీటు.

ఆయన రెడీగా ఉన్నారట….

అది కూడా కుప్పంలో ఆయ‌న మాత్రమే విజ‌యం సాధించారు. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. వైసిపి ఆహ్వానిస్తే.. వెళ్లిపోయేందుకు టిడిపిలోకి వైసీపీ నుంచి మంత్రిగా చక్రం తిప్పిన అమరనాథ్‌రెడ్డి రెడీగా ఉన్నారు. ఆయన బాటలోనే పీలేరు నుంచి పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి కూడా తట్టబుట్టా సర్దుకున్నారని, జగన్ కన్నుగీటితే ఫ్యాన్ రెక్కలు పట్టుకుని వేలాడేందుకు రెడీ అంటున్నారు పరిశీలకులు.

నిరాశా నిస్పృహలతో…..

ఇక, చాలా నియోజకవర్గాల్లో త‌మ్ముళ్లను న‌డిపించే దిక్కుకూడా లేకుండా పోయింది. పోనీ.. చంద్రబాబు సొంత జిల్లా అయినందున‌ ఆయన కుమారుడు, మాజీ మాజీ మంత్రి నారా లోకేష్ ఇక్కడ ఏమైనా ప్రభావం చూపుతాడ‌ని, తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకున్నా.. ఆయ‌న మంగళగిరి నుంచే మ‌ళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఇక్కడ టిడిపిలో నిరాశ, నిర్వేదం తాండవిస్తుండ‌గా.. వైసీపీ శ్రేణుల్లో ఆనందం పెల్లుబుకుతోంది. మరి బాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Tags:    

Similar News