కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే…?

రాజ‌కీయాల్లో అవ‌కాశం, అవ‌స‌ర‌మే.. నేడు ప్రధాన ప్రాణ వాయువులుగా మ‌న‌గ‌లుగు తున్నాయ‌న‌డానికి ఇప్పటికే దేశంలో అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల‌కు సిద్ధాంతాలు, వైరుధ్యాలతో [more]

Update: 2019-07-13 08:00 GMT

రాజ‌కీయాల్లో అవ‌కాశం, అవ‌స‌ర‌మే.. నేడు ప్రధాన ప్రాణ వాయువులుగా మ‌న‌గ‌లుగు తున్నాయ‌న‌డానికి ఇప్పటికే దేశంలో అనేక ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల‌కు సిద్ధాంతాలు, వైరుధ్యాలతో ప‌నిలేకుండా పోతోంది. ఇప్పు డు ఇలాంటి ప‌రిణామ‌మే తెలంగాణ‌లోనూ క‌నిపిస్తోంది. అధికారం కోసం ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు నూరుకునే బీజేపీ-కాంగ్రెస్‌లు, నిత్యం విమ‌ర్శలు రువ్వుకునే రెండు జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మాత్రం ఒక్కతాటిపైకి వ‌చ్చాయి. శ‌తృవుకు శ‌తృవు.. మ‌న‌కు మిత్రుడు అయిన‌ట్టుగా ఈ రెండు పార్టీలు కేసీఆర్ కు వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణయించుకున్నాయి.

సచివాలయం కూల్చివేతపై…

తాజాగా తెలంగాణ అధికార పార్టీ ఇప్పటి వ‌ర‌కు ఉన్న స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో నూత‌న అధునాత‌న సౌక‌ర్యాల భ‌వ‌నాన్ని నిర్మించాల‌ని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే భూమి పూజ కూడా అయి పోయింది. అయితే, రెండో సారి కేసీఆర్ అధికారంలోకి రావ‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్న కాంగ్రెస్‌, బీజేపీలు.. ఆయ‌న‌పై క‌త్తిక‌ట్టాయి. ఎలాగైనా.. ఆయ‌నను ఇరుకున పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స‌చివాల‌యాన్ని కూల్చే యాల‌న్న కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. ఇక‌, నిన్న మొన్నటి వ‌ర‌కు ఎవ‌రికి వారుగా కేసీఆర్‌పై యుద్ధాన్ని ప్రక‌టించారు.

ఇద్దరూ కలసి పోరాటం….

అయిన‌ప్పటికీ.. కేసీఆర్ మొండిగా త‌న నిర్ణయాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణయించారు. ఈ నేప‌థ్యంలో త‌మ పాత వైరాన్ని సైతం ప‌క్కన పెట్టిన కాంగ్రెస్‌-బీజేపీలు ఒకే వేదిక‌ను పంచుకునికేసీఆర్ కు వ్యతిరేకంగా గళం వినిపించాల‌ని నిర్ణ యించాయి. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజల పక్షా న పోరాటం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపాయి. తెలంగాణ సీఎం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణాలను ఈ రెండు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మాజీ ఎంపీ జి. వివేక్ తాజాగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.

రాజకీయం సంచలనమే…..

ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్, టీడీపీ, టీజేఎస్ బీసీ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ భవనాలను కూల్చవద్దని అఖిలపక్షం తీర్మానం చేసింది. కొత్త భవనాల నిర్మాణాన్ని ఈ సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు ఉన్న సమయంలో కొత్త భవనాల నిర్మాణాలు అవసరం లేదని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న భవనాలు మరో 30 నుండి 40 ఏళ్లకు పైగా వినియోగించుకొనే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ప‌రిణామంపై ఢిల్లీలోనూ కేసీఆర్ కు వ్యతిరేకంగా గ‌ళం వినిపించాల‌ని నిర్ణయించారు. మొత్తానికి రెండు పార్టీలు కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు చేతులు క‌ల‌ప‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారింది.

Tags:    

Similar News