బాబు బిగిన్ చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మిషన్ 2024ను ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు కనపడుతోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయిన చంద్రబాబునాయుడు ఈసారి ఆ [more]

Update: 2019-07-26 06:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మిషన్ 2024ను ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు కనపడుతోంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలయిన చంద్రబాబునాయుడు ఈసారి ఆ తప్పు చేయడానికి సిద్ధంగా లేరు. ఈసారి అన్ని రాజకీయ పార్టీలతో కలసి ప్రస్తుత ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రజావ్యతిరేక విధానాలను సమిష్టిగా ఇతర పార్టీలతో కలసి ప్రభుత్వంపై ఉద్యమించాలని భావిస్తున్నారు.

ఒంటరిగా పోటీ చేసి….

చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారు. దారుణమైన ఓటమితో పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉంది. ఇప్పుడు తనకు ఇతర పార్టీల సహకారం కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమయింది. దానిని చంద్రబాబునాయుడు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ తమ పార్టీ నేతలనే టార్గెట్ చేసింది. దీంతో ఆ పార్టీతో కూడా జట్టుకట్టే అవకాశం లేదు.

ఆ ఇద్దరితో కలిస్తే…..

ఇప్పుడు చంద్రబాబునాయుడు జనసేన, కమ్యునిస్టు పార్టీలతో సఖ్యతగా మెలగాలని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించాలని, నిరసనలను తెలియజేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ వైఖరితో అమరావతి నిర్మాణపనులు నిలిచిపోయాయని, రాష్ట్రంలో ఇతర పార్టీల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్న అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.

దీక్షకు ప్లాన్ చేశారా…?

ఈ మేరకు ప్రజాసమస్యలపై ఉద్యమించడానికి జనసేన సహకారం తీసుకోవడానికి చర్చలు కూడా ప్రారంభించారు. నాదెండ్ల మనోహర్ తో టీడీపీ ముఖ్యనేత ఒకరు ఈ విషయంపై మాట్లాడినట్లు చెబుతున్నారు. అలాగే అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే పవన్ కల్యాణ్ తో కలసి అక్కడే దీక్ష చేయాలన్న ప్లాన్ లో కూడా చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇలా జనసేన, కమ్యునిస్టులను ఇప్పటి నుంచే కలుపుకుని వెళ్లి వచ్చే ఎన్నికలకు కలసి వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచనగా కన్పిస్తోంది. మరి పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలసి వస్తారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News