ఆ టీడీపీ మాజీ..ఈ వైసీపీ సిట్టింగు.. క‌లిసిపోయారు..అదిరేటి పాలిటిక్స్‌

అవును! గుంటూరు జిల్లాలో ఎవ‌రిని అడిగినా.. ఇదే మాట చెబుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే.. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పాలు నీళ్ల మాదిరిగా క‌లిసిపోయార‌ట‌. వాస్తవానికి అధికారంలో [more]

Update: 2020-07-01 15:30 GMT

అవును! గుంటూరు జిల్లాలో ఎవ‌రిని అడిగినా.. ఇదే మాట చెబుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే.. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పాలు నీళ్ల మాదిరిగా క‌లిసిపోయార‌ట‌. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీతో ప్రతిప‌క్ష పార్టీలు వైరుధ్యంగానే వ్యవ‌హ‌రిస్తాయి. ఇరు ప‌క్షాల నాయ‌కులు కూడా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటారు. విమ‌ర్శలు చేసుకుంటారు.. స‌వాళ్లు విసురుకుంటారు. కానీ, విచిత్రంగా గుంటూరులోని ఒక నియోజ‌క‌వ ‌ర్గంలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిప‌క్ష పార్టీ టీడీపీ మాజీ ఎమ్మెల్యేతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగు తున్నార‌ట‌! అయితే, ఇది బ‌హిరంగంగా కాక‌పోయినా.. చాటుమాటుగా మాత్రం చేతులు క‌లుపుకొంటున్నార‌ని అంటున్నారు.

ఐదు సార్లు విజయం సాధించి…

విష‌యంలోకి వెళ్తే.. పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఆవిర్భావించిన త‌ర్వాత ధూళిపాళ్ల న‌రేంద్ర, ఆయ‌న తండ్రి ఇక్కడ చ‌క్రం తిప్పారు. న‌రేంద్ర కుమార్ ఏకంగా ఐదుసార్లుగా వ‌రుస విజ‌యాలు సాధించి.. టీడీపీని ఓ రేంజ్‌లో నిల‌బెట్టారు. ప‌ద‌వులు వ‌చ్చినా.. రాకున్నా.. ఆయ‌న ప‌ట్టించుకోకుండా .. త‌న పార్టీ, త‌న వ్యాపారం అంటూ.. ఇదే పంథాలో ముందుకు సాగారు. కాంగ్రెస్ స‌హా.. వైసీపీ కూడా అనేక మంది నాయ‌కుల‌ను ఇక్క‌డ పెట్టి ధూళిపాళ్ల హ‌వాకు బ్రేకులు వేయాల‌ని భావించినా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల వ‌రకు ఎవ‌రికీ ఇది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు అల్లుడు రోశ‌య్యను వైసీపీ ఇక్కడ నిల‌బెట్టింది.

మిర్చియార్డులో భాగస్వాములుగా….

నామినేష‌న్లకు ముందు ఇక్కడ దిగిన రోశ‌య్య 20 రోజుల్లోనే విజ‌యం సాధించారు. దీంతో రాజ‌కీయంగా రంజుగా ఉంటుంద‌ని, న‌రేంద్ర కుమార్‌కు చెక్ పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా గ‌తంలో ఉమ్మారెడ్డి టీడీపీలో ఉండ‌గా ఉన్న ప‌రిచ‌యాల‌తో న‌రేంద్ర కుమార్ రోశ‌య్యను మ‌చ్చిక చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరూ కూడా మిర్చియార్డులో వ్యాపార భాగ‌స్వాములే. ఈ నేప‌థ్యంలో ఒక‌రు అధికార‌ప‌క్షంలో ఉన్నప్పటికీ.. మ‌రొక‌రు ప్రతిప‌క్షంలో ఉన్నా కూడా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసుకోరు స‌రిక‌దా.. ఒక‌రికి ఒక‌రు స‌హాయం చేసుకుంటూ.. ముందుకు సాగుతున్నార‌న్న గుస‌గుస‌లు జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో ఏం జరుగుతున్నా….

న‌రేంద్ర కుమార్ త‌న‌కు గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా జ‌గ‌న్‌ను విమ‌ర్శించినా కిలారు రోశ‌య్య నుంచి పెద్ద కౌంట‌ర్లు ఉండ‌వు. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో రోశ‌య్య ఏం చేసుకున్నా న‌రేంద్ర నోరు మొద‌ప‌ర‌ట‌. అలాగే న‌రేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంగం డెయిరీ నిధుల‌తోనే నిర్మించిన హాస్పిట‌ల్స్‌లో అవ‌క‌త‌వ‌క‌లు ఉన్నాయ‌న్న విమ‌ర్శలు ఉన్నా రోశ‌య్య కిమ్మన‌ర‌ని అంటున్నారు. అందుకే .. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించే అధికార‌-ప్రతిప‌క్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, విమ‌ర్శనాస్త్రాలు ఇక్కడ మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. పైగా ధూళిపాళ్లకు డెయిరీ వ్యాపారం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు అధికార పార్టీ అవ‌స‌రం ఉంది. సో.. మొత్తానికి ఈ ఇద్దరు నేత‌లు కూడా ఇలా పాలు నీళ్ల మాదిరిగా క‌లిసి మెలిసిపోయార‌ని గుంటూరు ప్రజ‌లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News