ఈ టీడీపీ మ‌హిళా నేత‌కు పొలిటిక‌ల్ క‌ష్టాలు… కెరీర్ క్లోజేనా ?

వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకోవ‌డం. రాజ‌కీయాల్లోకి రావ‌డం పెద్ద గొప్పవిష‌యం.. గొప్ప విశేషం కానేకావు. కానీ, వాటిని నిల‌బెట్టుకోవ‌డం.. త‌మ తండ్రులు, తాత‌ల పేరుకు త‌గ్గట్టు రాజ‌కీయాలు చేయ‌డం అనేదే [more]

Update: 2021-05-07 14:30 GMT

వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకోవ‌డం. రాజ‌కీయాల్లోకి రావ‌డం పెద్ద గొప్పవిష‌యం.. గొప్ప విశేషం కానేకావు. కానీ, వాటిని నిల‌బెట్టుకోవ‌డం.. త‌మ తండ్రులు, తాత‌ల పేరుకు త‌గ్గట్టు రాజ‌కీయాలు చేయ‌డం అనేదే కీల‌క విష‌యం. అయితే. ఈ విష‌యంలో చాలా మంది నాయ‌కులు త‌డ‌బ‌డు తున్నారు. ముందు దూకుడుగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం.. ప్రజ‌ల అభిమానాన్ని సంపాదించుకోలేక పోతున్నారు. ఇక ప్రజ‌లు కూడా వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కాలం చెల్లేలా చేస్తున్నారు. వార‌స‌త్వం ఉన్నా ప్రజల్లో ఉండ‌ని నేత‌ల‌ను ఒక‌టి రెండు ఎన్నిక‌ల‌కే ఇంటికి పంపేస్తున్నారు. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లా నందిగామ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయ‌కురాలు.. తంగిరాల సౌమ్య ముందున్నారు.

టీడీపీకి పట్టున్న……

నందిగామ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. 1994 నుంచి ఇక్కడ 2019 ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు టీడీపీకి ఓట‌మే లేదు. ముందు జ‌న‌ర‌ల్‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌ర్వాత రిజ‌ర్వ్‌డ్ అయిన‌ప్పటికీ.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, దివంగ‌త దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ ఒక‌సారి, త‌ర్వాత దేవినేని ఉమా రెండు సార్లు ఇక్కడ విజ‌యం ద‌క్కించుకున్నారు. పార్టీకి బ‌లమైన కంచుకోట‌గా దీనిని మార్చారు. ఇక‌, 2009 లో ఈ నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ్ అయింది. ఈ క్ర‌మంలో తంగిరాల ప్రభాకర్ రావు విజ‌యం సాధించారు. త‌ర్వాత 2014లోనూ ఆయ‌నే రెండోసారి గెలిచారు.

తొలిసారి ఓటమి….

అయితే.. ఆయ‌న 2015లో హ‌ఠాన్మర‌ణం చెంద‌డంతో ఆయ‌న కుమార్తె తంగిరాల సౌమ్య రంగంలోకి దిగారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని.. ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ పోటీకి ఎవ‌రినీ పెట్టకుండా.. తంగిరాల సౌమ్యను ఏక‌ప‌క్షంగా గెలిపించేందుకు స‌హ‌క‌రించింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నామ‌మాత్రంగా పోటీ చేసింది. ఎమ్మెల్యేగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌మైన ముద్ర ఏ మాత్రం వేయ‌లేక‌పోయారు. చిన్న ప‌ద‌వులు, ప‌నులు కూడా దేవినేని ఉమా చెప్పిన‌ట్టే చేయాల్సి వ‌చ్చింది. ఇక గత 2019 ఎన్నిక‌ల్లో తంగిరాల సౌమ్య ఇక్కడ ప‌ట్టుబ‌ట్టి టికెట్ ద‌క్కించుకున్నా.. గెలుపు గుర్రం మాత్రం ఎక్కలేక పోయారు. అంటు,, వ‌ర‌కు పార్టీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా గెలుచుకుంటూ వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి ఓడిపోవాల్సి వ‌చ్చింది.

పార్టీని ఏ మాత్రం…?

ఎన్నిక‌ల్లో ఓడిపోయాక తంగిరాల సౌమ్య నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఏ మాత్రం ముందుండి న‌డిపించ‌లేక‌పోతున్నారు. పార్టీ ప‌ద‌వులు, ఇత‌ర విష‌యాలు కూడా ఆమెకు తెలియ‌కుండానే జ‌రిగిపోతున్నాయి. ఆమె నామ్ కే వాస్తేగా మాత్రమే నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా ఉంటున్నారు. పైగా పార్టీ కేడ‌ర్‌ను క‌లుపుకోలేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. సౌమ్య తండ్రి ప్రభాక‌ర్ రావు సైతం రాజ‌కీయంగా దూకుడు చూపించ‌క‌పోయినా ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండే విష‌యంలో మంచి మార్కులు వేయించుకున్నారు.

వెనక ఉండి నడిపిస్తేనే?

తంగిరాల సౌమ్య ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు. ప్రజ‌ల‌ను నేరుగా క‌ల‌వ‌డం లేదు. వెన‌కాలో ఎవ‌రో ఒక‌రు ఉండి న‌డిపిస్తేనే న‌డుస్తున్నార‌న్న భావ‌న వ్యక్తమ‌వుతోంది. దీంతో ఆమెను నందిగామ కేడ‌ర్ ఎంత‌మాత్రం ఇష్టప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది దీంతో ఇక్కడ టికెట్ సంపాయించు కునేందుకు , సౌమ్యకు చెక్ పెట్టేందుకు ఒక‌రిద్దరు ఎస్సీ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేడ‌ర్ కూడా ఈ సారి తంగిరాల సౌమ్యను మా నెత్తిపై రుద్దాల‌ని చూడొద్దని కూడా ఉమాకు నేరుగానే చెప్పేస్తున్నార‌ట‌. తంగిరాల సౌమ్య ఇప్పటికి అయినా పార్టీలో త‌న‌దైన పంథాలో వెళ్ల‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆమె పొలిటిక‌ల్ కెరీర్‌కు శుభం కార్డు ప‌డిన‌ట్టే ?

Tags:    

Similar News