తమ్మినేని తెలివి.. అందుకోసమేనటగా?

తమ్మినేని సీతారాం. ఒకనాటి బాడీ బిల్డర్, మంచి వాగ్దాటి ఉంది. సబ్జెక్టు బాగా ఉంది. పాతతరం, కొత్తతరం మధ్యన రాజకీయ వారధి. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి [more]

Update: 2020-07-08 08:00 GMT

తమ్మినేని సీతారాం. ఒకనాటి బాడీ బిల్డర్, మంచి వాగ్దాటి ఉంది. సబ్జెక్టు బాగా ఉంది. పాతతరం, కొత్తతరం మధ్యన రాజకీయ వారధి. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు కూడా చేసిన అనుభవశాలి. ఇక రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ ఆముదాలవలసలో జెండా ఎగరేసి మంత్రి కావాలనుకుని వేచి చూసి చివరకు స్పీకర్ కుర్చీలో కూర్చున్న పెద్ద మనిషి. అయితే ఆయన మీద అందరికీ సీనియర్ అన్న అభిమానం గౌరవం ఉన్నా తమ్మినేని సీతారాం తన వ్యవహారశైలితో వాటిని తగ్గించుకుంటున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. జిల్లాలో కాళింగ బీసీ వర్గానికి చెందిన బలమైన నేతగా, జిల్లాలో మరో బలమైన బీసీ వెలమలను ఢీ కొట్టే నాయకునిగా నిలిచిన తమ్మినేని సీతారాంకి రాజకీయ జీవిత చరమాంకంలో అత్యున్నత రాజ్యాంగ పదవి దక్కింది.

మర్యాద ఉంచరా…?

రాజ్యాంగ పదవులు భ్రష్టు పడుతున్నాయన్న చర్చ ఓ వైపు దేశంలో సాగుతోంది. మరీ ముఖ్యంగా స్పీకర్ వంటి పదవులు పూర్తిగా రాజకీయపరంగా మారిపోతున్నాయని కూడా ఆవేదన ఉంది. నవ్యాంధ్ర తొలి స్పీకర్ గా పనిచేసిన దివంగత కోడెల శివప్రసాదరావు టీడీపీ వైపు అప్పట్లో మొగ్గు చూపుతూ సభను నిర్వహించడం పైనా రచ్చ జరిగింది. ఆయన చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా నాటి సీఎం చంద్రబాబుని కీర్తిస్తూ మీరు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి సభకు రావాలని కోరడం కూడా పెద్ద చర్చగా మారింది. ఆయన తరువాత వైసీపీ సర్కార్ తరఫున స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరిస్తూ అన్న తొలి మాట తాను రాజ్యాంగ విలువలు పెంచుతాను అని.

రాజకీయేమే….

కానీ జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంది. తమ్మినేని సీతారాం తెల్లారిలేస్తే ఎక్కువగా మాట్లాడేది రాజకీయమే. ఆయన మీడియా ముందుకు వచ్చి బోల్డ్ గా మాట్లాడేస్తున్నారు. ఏవేవో వివాదాస్పద అంశాలు కూడా చర్చకు తెస్తున్నారు. దాంతో వైసీపీ సర్కార్ ఎప్పటికపుడు ఇరకాటంలో పడుతోంది. తాజాగా ఆయన న్యాయ వ్యవస్థ మీద చేసిన కామెంట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. రాజ్యాంగబధ్ధమైన వ్యవస్థలు ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోరాదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నా కూడా దాని కంటే ఎక్కువగా చేసిన రాజకీయ వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి.

మంత్రి కోరిక …..

ఇక తమ్మినేని సీతారాం ఇంతలా క్రియాశీలం కావడం వెనక ఆయన మంత్రి పదవి కోరిక ఉందని అంటున్నారు. శ్రీకాకుళం జిలాల్లో ఆయన అధికారులతో సమీక్షలు చేస్తారు. దూకుడు రాజకీయం చేస్తారు. వర్తమాన రాజకీయ మీద నిరంతరం తమ కామెంట్స్ ని పాస్ చేస్తూనే ఉంటారు. అసలైన మంత్రి గారు ధర్మాన క్రిష్ణ దాస్ మాత్రం నిమ్మళంగా ఉంటే తమ్మినేని సీతారాం చంద్రబాబు నుంచి మొదలుపెట్టి జిల్లా నాయకులను ఎవరినీ వదిలిపెట్టడం లేదు. దాంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తే బెటర్ అన్న మాట విపక్షం నుంచే వినిపిస్తోంది. మరి విస్తరణకు పూనుకుంటున్న జగన్ ఆ దిశగా ఆలోచన చేసి స్పీకర్ గా మరొకరిని ఎన్నుకుంటే మంచిదేమోనని సూచనలు వస్తున్నాయి. మొత్తానికి పెద్దాయన పెదవి విప్పకుండానే తమ మంత్రి కోరికను జగన్ దాకా తెలివిగా చేరవేస్తున్నాడని అంటున్నారు.

Tags:    

Similar News