ఆ గుబులు ఇద్దరికీ పట్టుకుందా?

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకేలో గుబులు బయలుదేరింది. దీనికి ప్రధాన కారణం శశికళ జైలు నుంచి విడుదల అవుతుండటమే. ఎన్నికలకు ముందే విడుదల అవుతుండటంతో పార్టీ [more]

Update: 2021-01-19 17:30 GMT

తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకేలో గుబులు బయలుదేరింది. దీనికి ప్రధాన కారణం శశికళ జైలు నుంచి విడుదల అవుతుండటమే. ఎన్నికలకు ముందే విడుదల అవుతుండటంతో పార్టీ ఎన్నికలకు ముందే సంక్షోభంలో పడిపోతుందన్న ఆందోళన అన్నాడీఎంకే నేతల్లో ఉంది. శశికళ జైలు నుంచి బయటకు రాగానే తమ పార్టీపై కన్నేస్తారని, తద్వారా ఇబ్బందులు ఎదురవుతాయని పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు భావిస్తున్నారు.

హడావిడిగా సమావేశం…..

అందుకే అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమిని రూపొందించే అధికారం ఆ పార్టీ పళనిస్వామి, పన్నీర్ సెల్వంలకు అప్పగించింది. ఈ హడావిడి సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం శశికళ రాక అని చెబుతున్నారు. అందుకే కూటమిలో ఎవరు ఉండాలి? ఎన్ని సీట్లు కేటాయించాలన్న అధికారం వీరిద్దరికే అన్నాడీఎంకే కట్టబెట్టింది. దీంతో పాటు మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామిని అన్నాడీఎంకే ప్రకటించింది.

బీజేపీ వ్యూహానికి….

కొంతకాలంగా బీజేపీ అన్నాడీఎంకేను ఇబ్బంది పెడుతోంది. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల తర్వాతనే నిర్వహించాలని పట్టుబడుతుంది. దీంతో పాటు స్థానాల కేటాయింపులో కూడా బీజేపీ పై చేయి సాధించాలని భావిస్తుంది. అందుకే ముందు జాగ్రత్త గా కూటమిలో నిర్ణయాలను తామే ప్రకటిస్తామని అన్నాడీఎంకే చెబుతుంది. స్థానాల కేటాయింపులో కూడా తాముచెప్పినట్లే నడుచుకోవాలని పరోక్షంగా సంకేతాలను పంపింది.

శశికళను నిలువరించేందుకు…..

శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకేలోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఎన్నికల్లో అన్నాడీఎంకే ను ముందుకు తీసుకెళ్లలేరన్న అపనమ్మకంతోనే బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తుంది. శశికళ కూడా అన్నాడీఎంకేను తన హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. దానికి బీజేపీ సహకారం అందిస్తే అన్నాడీఎంకేలో సంక్షోభం తప్పదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అధికారాలను తామే తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద శశికళ బయటకు వస్తే అన్నాడీఎంకేలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News