ఏపీకి ఏమాత్రం ఏం తీసిపోరు?

ఆంధ్రప్రదేశ్ కు పొరుగునే ఉన్న తమిళనాడులో రాజకీయాలకు సమయం లేదు. సందర్భం ఉండదు. తమిళ రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేవ్ రాజకీయాలను మరిపిస్తున్నాయి. తమిళనాడులో [more]

Update: 2020-04-27 18:29 GMT

ఆంధ్రప్రదేశ్ కు పొరుగునే ఉన్న తమిళనాడులో రాజకీయాలకు సమయం లేదు. సందర్భం ఉండదు. తమిళ రాజకీయాలు కూడా సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేవ్ రాజకీయాలను మరిపిస్తున్నాయి. తమిళనాడులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయిన రాష్ట్రం ఇదే. ఇక్కడ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

అత్యధిక కేసులతో….

కరోనా ప్రవేశించిన కొత్తల్లో అన్ని పార్టీలూ సహకరించుకుని ముందుకు వెళ్లాలని భావించాయి. కానీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగే కొద్దీ రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ ప్రభుత్వం చేతకాని తనం వల్లనే కరోనా రాష్ట్రంలో విజృంభిస్తుందని తెలిపారు. సక్రమంగా లాక్ డౌన్ ను పాటించడం లేదని, అధికార పార్టీ నేతలే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

అధికార పార్టీపై విమర్శలు….

ఒకవైపు కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారికి సాయం అందచేస్తూనే స్టాలిన్ అధికార పార్టీపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్నారు. కేరళ, కర్ణాటకలో తొలుత కేసు నమోదయిన వెంటనే తమిళనాడులో అప్రమత్తమయి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావన్నది స్టాలిన్ అభిప్రాయంగా ఉంది. అధికార పార్టీ కరోనా నిధులను కూడా దుర్వినియోగం చేస్తుందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షంపై పళనిస్వామి…….

అయితే ముఖ్యమంత్రి పళనిస్వామి దీనిని ఖండిస్తున్నారు. కఠిన సమయంలో కలసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో స్టాలిన్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు. ఇకపై స్టాలిన్ ఇచ్చే సలహాలను కూడా స్వీకరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా పళని స్వామి హెచ్చరించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగానే తమిళనాడులో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.

Tags:    

Similar News