బలపడాలని మార్చేస్తున్నారా…?

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను మార్చేస్తారని టాక్ బలంగా విన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే [more]

Update: 2019-07-27 00:30 GMT

తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను మార్చేస్తారని టాక్ బలంగా విన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే బల పడుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన స్థానాలను దక్కించుకుంది. నాలుగు పార్లమెంటు స్థానాలను దక్కించుకోవడంతో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గవర్నర్ నరసింహన్ మార్పు తప్పదని అంటున్నారు.

విభజన సమస్యలతో…..

గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గవర్నర్ గా నియమితులై పదేళ్లకు పైగానే అవుతుంది. అయితే కేంద్రం పెద్దలతో సత్సంబంధాలు ఉండటంతో గవర్నర్ నరసింహన్ ను కొనసాగిస్తూ వచ్చారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ గవర్నర్లను మార్చినా నరసింహన్ ను కొనసాగించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఉండటంతో నరసింహన్ ను మార్చలేదు.

రాష్ట్ర నేతల వత్తిడితో…..

అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. భారతీయ జనతా పార్టీ నేతలు గవర్నర్ నరసింహన్ ను మార్చాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో సఖ్యతగా ఉండటం, కీలక అంశాలపై నరసింహన్ స్పందించకపోవడంతో బీజేపీ రాష్ట్ర నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ ను నియమించారంటున్నారు.

మార్చేయాలని…..

రాష్ట్ర బీజేపీ నేతలు సయితం తమకు బీజేపీ నేత గవర్నర్ గా కావాలని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించే గవర్నర్ నరసింహన్ తొలిసారి మున్సిపల్ చట్టానికి సవరణ కోరారని చెబుతున్నారు. రాజకీయంగా కేసీఆర్ తో పని పడుతుందని భావించిన బీజేపీ కేంద్ర నాయకత్వం నరసింహన్ ను ఉపయోగించవచ్చుకోవచ్చని భావించారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. బీజేపీకి చెందిన వారినే తెలంగాణలోనూ గవర్నర్ గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ కు మరో ముఖ్యమైన పదవి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు.

Tags:    

Similar News