జూనియర్ వచ్చినా అంతేనా ?

ఆ ఒక్క ఆశ కూడా లేదా. తెలుగుదేశం పార్టీ వైభోగం గతానికే పరిమితమా. ఇపుడు ఆ పార్టీ గురించే అభిమానులు, వ్యతిరేకులూ కూడా చర్చించుకుంటున్నారు. ఏపీలో మరో [more]

Update: 2020-08-17 00:30 GMT

ఆ ఒక్క ఆశ కూడా లేదా. తెలుగుదేశం పార్టీ వైభోగం గతానికే పరిమితమా. ఇపుడు ఆ పార్టీ గురించే అభిమానులు, వ్యతిరేకులూ కూడా చర్చించుకుంటున్నారు. ఏపీలో మరో రెండు టెర్ములు జగనే అధికారంలో ఉంటారని ఆ పార్టీ మద్దతుదారుగా ఉన్న సినీ నటుడు రాజా రవీంద్ర ఈ మధ్య ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. తాను మెగా ఫ్యామిలీని నటనాపరంగా అభిమానిస్తాను అంటూనే రాజకీయాల్లో నటులకు ఉన్న ప్లేస్ ఏంటి, జనాలు వారి గురించి ఏమాలోచిస్తారన్నది కూడా ఆయన చెప్పుకొచ్చారు. తమ హీరో సినిమా కోసం డబ్బులు పెట్టి చూసే జనమే అదే హీరోను నాయకుడిని చేసి ఓటేయాలంట ఎన్నో ఆలోచిస్తారని రాజా రవీంద్ర చెప్పారు. సినిమావారు రాజకీయాల్లో రాణించాలంటే చాలా చేయాలని కూడా ఆయన అన్న మాటలు అందరికీ వర్తిస్తాయి. ఇది నిజంగా మంచి విశ్లేషణ.

రెండు దశాబ్దాలా..?

ఇక ఇదే కోవలో మరో సినీ న‌టుడు కమ్ వైసీపీ నేత థర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ని మించిన స్టార్ ఎవరూ లేరనేశారు. జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలంటే మరో రెండు దశాబ్దాల పాటు ఆగాల్సిందే అని కూడా చెప్పారు. అంతవరకూ ఏపీలో రాజకీయంగా ఖాళీ కూడా ఉండదని అన్నారు. మరి ఆయన మాట ప్రకారం అనుకున్నా అప్పటికి టీడీపీ ఉంటుందా. పైగా సినీనటుల మీద అభిమానం జనాలకు ఇప్పటికే బాగా కరిగిపోతున్న దశ. నాటికి ఇంకా ఆ సినీ మోజు గట్టిగా ఉంటుందా. అంటే జూనియర్ మాకు పోటీ కాదు, టీడీపీని లీడ్ చేయలేడు అన్నట్లుగానే ప్రుధ్వీరాజ్ చెప్పేశారు.

బాగుపడదుట….

ఇక వైసీపీ మంత్రి కొడాలి నాని నోటి వెంట జూనియర్ ఎన్టీయార్ కి వ్యతిరేకంగా కామెంట్స్ రావడం అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే హరిక్రిష్ణ, కొడాలి నాని మంచి దగ్గరివారు, ఇక జూనియర్ ఎన్టీయార్ కొడాలి నానిని అన్నయ్య అని పిలుస్తాడు. అంతటి బంధం ఉన్న నాని జూనియర్ వచ్చినా టీడీపీని బతికించలేడు అనేశారు. టీడీపీ పని అయిపోయిందని, రెండు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా 225 సీట్లతో అన్న ఎన్టీయార్ నుంచి చంద్రబాబు వద్దకు టీడీపీ చేరిందని చెప్పుకొచ్చారు. ఇపుడు చూస్తే బాబు జమానాలో తెలంగాణాలో చిత్తు అయిందని, ఏపీలో ఉన్న 175లో వంద సీట్లలో పోటీ కూడా పెట్టలేని స్థితిలో టీడీపీ ఉందని, ఈ పార్టీని జూనియర్ ఎన్టీయార్ వచ్చి ఏం చేస్తాడు అంటూ గట్టిగానే ప్రశ్నించారు. అంటే జూనియర్ ఎన్టీయార్ వస్తే టీడీపీకి ఏమైనా జవసత్వాలు వస్తాయని ఆశపడుతున్న తమ్ముళ్లకు కళ్ళు తెరిపించేలాగే ఈ విశ్లేషణలు ఉంటున్నాయి. నిజానికి చంద్రబాబు కళ్ల ముందు పార్టీ సమాధి అయినా భరిస్తారు తప్ప తాను, తన కొడుకూ కాకుండా వేరే ఎవరికో పార్టీని అప్పగించాలని కలలో కూడా అనుకోరు. మొత్తానికి జూనియర్ మీద తమ్ముళ్ళు ఎవరికైనా భ్రమలు ఉన్నా ఇక వాటిని మానుకోవచ్చుననే ఈ చర్చల సారాంశంగా ఉంది.

Tags:    

Similar News