జెయింట్ కిల్లర్ అవుతారా? అదే జరిగితే?

సువేందు అధికారి. . . నిన్నమెున్నటిదాకా ఆయన పేరు బెంగాలీలకు, మరీ ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతప్రజలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు సువేందు అధికారి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. [more]

Update: 2021-04-07 16:30 GMT

సువేందు అధికారి. . . నిన్నమెున్నటిదాకా ఆయన పేరు బెంగాలీలకు, మరీ ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతప్రజలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు సువేందు అధికారి పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అందుకు కారణం నిన్నమెున్నటిదాకా తన అధినేత్రిగా ఉన్న మమతా బెనర్జీ ఆయనపై పోటీ చేయడమే. నందిగ్రామ్ నియెాజకవర్గంతో మెున్నటిదాకా మిత్రులైన మమత, సువేందు అధికారి తలపడుతుండటంతో నియెాజకవర్గంలో పాటు, ఇద్దరు నేతలు వార్తల్లో వ్యక్తులుగా మారారు. ముఖ్యమంత్రి మమత పేరుకు పశ్ఛిమబెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటికీ భాజపా పై దుాకుడుగా వ్యవహరిస్తుండటంతో జాతీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆమెపై పోటీ చేస్తుండటంద్వారా సువేందు అధికారి అదే స్ధాయిలో గుర్తింపు పొందుతున్నారు.

పట్టున్న కుటుంబం……

సువేందు అధికారిది రాజకీయ కుటుంబం. నందిగ్రామ్ ప్రాంతంలో వారి కుటుంబానికి మంచి పట్టుంది. తొలుత కాంగ్రెస్, తర్వాత టి.ఎం.సి, ప్రస్తుతం బీజేపీ లో ఆకుటుంబం కొనసాగుతోంది. 1970 డిసెంబరు 15 న పురబ్ మెదినీపుర్ జిల్లాలో జన్మించిన సువేందు అధికారి నేతాజీ సుభాస్ చంద్రబోస్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. చేశారు.1995 లో కంటై మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించిన సువేందు అధికారి అంచలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, ఎంపీగా వివిధ పదవుల్లో పనిచేశారు. 2006 లో కంతి (దక్షిణ్) నియెాజకవర్గంనుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 2014 లో “టమల్లక్” నియెాజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు 2016 లో నందిగ్రామ్ అసెంబ్లీ స్ధానం నుంచి టీఎంసీ అత్యధికంగా తిరుగులేని విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో ఆయన 90,000 కు పైగా మెజార్టీ సాధించారు. నియెాజకవర్గంలో సుమారు 25 నుంచి 30 శాతం ముస్లిం జనాభా ఉంది. వారు సంప్రదాయకంగా టీఎంసీ మద్దతుదారులు వీరి ఓట్లతోపాటు సొంత బలం కుాడా తోడవడంతో అప్పట్లో ఘనవిజయాన్ని నమెాదుచెశారు సువేందు అధికారి.

మమతకు కుడిభుజంగా…..

గత అయిదేళ్ళలో మమత మంత్రివర్గంలో సువేందు అధికారి కీలకంగా వ్యవహరించారు. రాజకయంగా ఆమెకు కుడిభుజంగా నిలిచారు. రవాణా, జల వనరుల మంత్రిగా పనిచేశారు. ఒకరకంగా చెప్పాలంటే పార్టీలో ఆయన నెంబరు2 గా నిలిచారు. కాలక్రమంలో మమత మేనల్లుడు అభిషేక్ ప్రాధ్యాన్యం పెరగడంతో పార్టీని అనివార్యంగా వీడాల్సి వచ్చిందని సువేందు అధికారి చెబుతున్నారు. కానీ బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఆశ చూపడంతో కాషాయకండువా కప్పుకున్నారన్నది విమర్శకుల వాదన. సీఎం పదవి కాకపోతే కనీసం కేంద్రంలో ఏదోఒక పదవి ఆయనకు ఖాయం. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి గతంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు. 15,16 లోక్ సభల్లో ఆయన ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ టమ్లుక్’ ఎంపీ. సువేందు అధికారి సోదరుడు దిబేందు అధికారి మున్సిపల్ చైర్మన్.

బలమైన రాజకీయ నేపథ్యం…..

బలమైన రాజకీయ నేపధ్యం హిదువులు అధికంగా ఉండటంతో నందిగ్రామ్ లో మమతను ఓడించగలనన్నది సువేందు అధికారి నమ్మకం. ముస్లింలు ఓటెయ్యనప్పటికి, మెాదీ చరిష్మా, తమ కుటుంబంనుంచి పలుకుబడితో మమతను నిలువరించడం కష్టమేమీ కాదన్నది సువేందు అధికారి అభిప్రాయ. ఈ ఉద్దేశంతోనే ఎన్నికల్లో ఓడితూ రాజకీయాలకు దుారమవుతానని భీష్మప్రతిజ్ఞ చేశారు. సువేందు అధికారి ఎంతోకొంత నమ్మకం లేనిదే ఇంతటి భీకర ప్రతిజ్ఞ చేయరు. నందిగ్రామ్ లో భుసేకరణ ఉద్యమంతో రాజకీయంగా సువేందు అధికారి తెరపైకి వచ్చారు. అప్పట్లో ఆయన మావోస్టులకు ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2014 లో శారదా చిట్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు సీబీఐ కేసు నమెాదుచేసింది. అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే ప్రత్యర్ధులు పెట్టిన కేసులని కొట్టిపారేస్తుంటారు సువేందు అధికారి. తమ కుటుంబానికి పశ్చిమ మిడ్నపుర్, పురులియా, బంకుార జిల్లాల్లో ప్రజాబలం ఉందని, అందువల్లే ఇంతకాలం కొనసాగగలిగామని, చెబుతుంటారు. ఇంతకీ నందిగ్రామ్ లో తలపడుతున్న మమత, సువేందు అధికారి ఇద్దరూ బ్రహ్మచారులే కావడం విశేషం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News