వ్రతం చెడినట్లేనా…?

సభను హుందాగా నడుపుతున్నారు, భిన్నమైన వాదనలకు అవకాశం ఇస్తున్నారు, చర్చ బాగా జరిగేలా చూస్తున్నారు. ఇదీ పాత గవర్నర్ నరసింహన్ జగన్ కి తాజాగా ఇచ్చిన కితాబు. [more]

Update: 2019-07-25 03:30 GMT

సభను హుందాగా నడుపుతున్నారు, భిన్నమైన వాదనలకు అవకాశం ఇస్తున్నారు, చర్చ బాగా జరిగేలా చూస్తున్నారు. ఇదీ పాత గవర్నర్ నరసింహన్ జగన్ కి తాజాగా ఇచ్చిన కితాబు. ఇక టీవీ డిబేట్లలో మేధావులు అనబడే వారు సైతం అసెంబ్లీ సెషన్స్ బాగా సాగుతున్నాయని, వెనకటి కల్చర్ కొంత తగ్గిందని అభిప్రాయపడుతున్న పరిస్థితి. వార్తా కధనాల్లో సైతం ఇదే రకమైన భావన వ్యక్తమవుతోంది. మొత్తానికి చూస్తే అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం ఓ హెడ్ మాస్టర్ గా సభను సవ్య దిశలో నడుపుతున్నారన్న ఆలోచన అందరిలో కలుగుతోంది. ఓ విధంగా ఇదే టీడీపీకి కూడా కంటగింపుగా మారిందేమో అనుకోవాలి. బడ్జెట్ సమావేశాల్లో ఓ దశలో అవేశ కావేశాలు సభ్యులు ప్రదర్శించినా వాకౌట్లు, సస్పెన్షన్ల దాకా కధ సాగకుండా తమ్మినేని జాగ్రత్తగా నడుపుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ప్రతిపక్షానికే అవకాశం ఇవ్వడని స్పీకర్ ని కోరడమూ ఇదే సభ చూసింది. ఇక సభలో నిబంధనలు గుర్తు చేస్తూ సభ్యులను గైడ్ చేస్తూ స్పీకర్ మంచి పాత్రనే పోషిస్తున్నారు. దాంతో గాడిలో సభ పడిందన్న ఏకాభిప్రాయం అంతటా వచ్చింది. అంతే సర్కార్ కి ఆ మంచి పేరు వద్దనుకులేలా ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం సాగిపోయింది.

వ్రతం చెడినట్లేనా..?

మేము గత అసెంబ్లీ మాదిరిగా సభను నడపం, ప్రతిపక్షం మైక్ కట్ చేయం. వారికి కావాల్సినంత సేపు అవకాశాలు ఇస్తాం, ప్రతిపక్షం సభలో ఉండాల్సిందే. ఇదీ జగన్ చెప్పిన మాట. కానీ జరిగింది మాత్రం కొంత భిన్నంగానే ఉంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు. అలాంటిది విపక్షం కూడా సహకరించాలి. సభ నిబంధనలు ఒకలా ఉంటే సభ్యుల వాదన మరోలా ఉంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు అధికార పక్షం నుంచి సమాధానం వస్తే దాన్ని పొడిగిస్తూ మరిన్ని అనుబంధ ప్రశ్నలు వేయాలనుకోవడం, విషయాన్ని పక్క దోవ పట్టించడం, దోషిగా ఒకరిని సభలో నిలపాలని ప్రయత్యించడం వంటివి కుయుక్తులు తప్పుడు వ్యూహాలు ఇదే మారని తీరు . మరి ఇలాగే చేయాలి. రాజకీయమంటే ఇదే. అధికార పక్షానికి పేరు వస్తే ప్రతిపక్షం విలువ ఏముంటుంది. క్రికెట్ మ్యాచ్ మాదిరిగా వికెట్లు పడగొట్టాలంతే. అలాంటి ఉద్దేశ్యాలు పెట్టుకుంటే సభలో సస్పెన్షన్లు తప్పవు మరి. సభా నాయకుడు మాట్లాడినపుడు ఆటంకపరచడం తో మొదలైన వ్యవహారం కాస్తా స్పీకర్ చైర్ వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన మైక్ సైతం కట్ చేసేందుకు ప్రయత్నించేదాకా సాగిపోయింది. మొత్తానికి అనివార్యంగా సభ్యులను స‌స్పెండ్ చేయాల్సివచ్చింది అన్నది వైసీపీ వాదన.

ట్రాప్ లో పడ్డారా…?

ఎక్కడా కూడా అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఒకే దారిలోకి రావు. వారిని ఓడించి వీరు అధికారంలోకి వచ్చారు. ఆ కసి, కోపం అలాగే ఉంటాయి. ఇక రాజకీయమే పరమావధి అయిన వేళ ప్రతీదీ అలాగే చేస్తారు, చూస్తారు. ఏపీ సభలో జగన్ ను టీడీపీ బాగా రెచ్చగొడుతూ వచ్చిందన్నది అసెంబ్లీ లైవ్ చూసిన వారికి అర్ధమయ్యే విషయం. జగన్ సైతం కొన్ని సార్లు మాటలు ధాటిగా వాడేశారు. ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చాం, మాట్లాడిద్దాం అనుకుంటే ఎంతవరకూ ఇవ్వగలరు, ఎంతవరకూ ఉదారంగా ఉండగలరు, పైగా ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటే చూస్తూ వూరుకేలేరు కదా. హద్దు ఒకటి ఉంటుంది, అది దాటితే అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా సమరమే. ఏపీ అసెంబ్లీలో అదే జరిగింది.

నోరు తెరిచి అడగక పోయినా….

మమ్మల్ని సస్పెండ్ చేయండి అని నోరు తెరచి అడగకపోయినా ఆ విధంగా టీడీపీ సభ్యులు వ్యవహరించారు, అలా అధికార పక్షం కూడా చేయి దాటేలా పరిస్థితి తెచ్చుకుంది. దాంతో సభలో సస్పెన్షన్లు అనివార్యం అయ్యాయి. మొత్తానికి టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడిందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మార్షల్స్ ని సభలోకి పిలిచి సభ్యులను గెంటించలేదు మేమెపుడూ అని తమ్ముళ్ళు అంటున్నారంటే ఇక వైసీపీ కూడా తేడా పార్టీ ఏమీ కాదని, స‌భను వారు సైతం రసాభాసగా నడుపుతున్నారని, జగన్ నియంతలా ఏలుతున్నారన్న సందేశాన్ని గట్టిగానే చెబుతున్నారన్న మాట. సభలో ఇరు పార్టీల ముసుగులు ఎటూ తొలగాయి కాబట్టి, ఇకపై సస్పెన్షన్లు పరిపాటి అవుతాయి. సో గట్టిగారెండు సభలు జరగకుండానే పాత పద్ధతిలోనే కొత్త అసెంబ్లీ కూడా వెళ్తోందన్న మాట.

Tags:    

Similar News