బ్రేకింగ్ : 24 గంటల్లో నిరూపించుకోవాలి

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష అవసరమని [more]

Update: 2019-11-25 06:11 GMT

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో ఫడ్నవిస్ తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బలం ఎంతుంది అనేది సుప్రీంకోర్టులో తేలదని, శాసనసభలోనే తేలుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీలయినంత త్వరగా బలపరీక్ష జరిగితేనే మంచిదని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్ భవన్ బలాన్ని నిర్ణయించలేదని, శాసనసభ మాత్రమే నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

వేడి వాడిగా వాదనలు….

తొలుత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమ మద్దతు బీజేపీకే నంటూ లేఖలు ఇవ్వడంతోనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని సొలిసిటర్ జనరల్ వాదించారు. గవర్నర్ అన్ని పార్టీలకూ ప్రభుత్వ ఏర్పాటు కోసం సమయం ఇచ్చినప్పటికీ వారు వినియోగించుకోలేకపోయారని తెలిపారు. ఎన్సీపీ తరుపున అజిత్ పవార్ లేఖ ఇచ్చినందునే గవర్నర్ తన సమ్మతిని తెలియజేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు బీజేపీ,శివసేన కూటమి వైపే ఉందని ఆయన వివరించారు. బీజేపీకి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేయలేదని చెప్పారు. లిఖితపూర్వకంగా సమర్పించేందుకు తమకు కొంత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరారు.

పూర్తి బలం ఉందంటూ….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉందని ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ విచారణ అవసరం లేదని, బలం ఉన్న పార్టీయే ప్రస్తుతం అధికారంలో ఉందని ఆయన వివరించారు. నవంబరు 9వ వరకూ గవర్నర్ అన్ని పార్టీలకూ అవకాశమిచ్చారన్నారు. బీజేపీకి తగిన బలం ఉందని శాసనసభలోనే బీజేపీ బలం నిరూపించుకుంటుందని, రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని ఆయన కోరారు. బలపరీక్షకు కోర్టులు ఆదేశించలేవని కూడా ఆయన అన్నారు.మరోవైపు ఎన్సీపీది తమదేనని అజిత్ పవార్ తరుపున న్యాయవాది వాదించారు. ఎన్సీపీలోని అంతర్గత విభేదాలను సరిచేసుకుంటామని చెప్పారు. ఉదయం 5గంటల సమయంలో రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని శివసేన తరుపు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రశ్నించారు. వెంటనే బలపరీక్ష జరపకుంటే ఫిరాయింపులకు ఆస్కారం ఇచ్చినట్లవుతుందన్నారు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అయితే సుప్రీం పూర్తి తీర్పు ఇంకా బయటకు వెలువడ లేదు.

Tags:    

Similar News