టీడీపీలోకి సుంక‌ర ప‌ద్మశ్రీ.. కీల‌క ప‌ద‌వి ఆఫ‌ర్‌

కాంగ్రెస్ నాయ‌కురాలు, సీనియ‌ర్ మ‌హిళా నేత సుంక‌ర ప‌ద్మశ్రీ.. టీడీపీలోకి చేర‌నున్నారా? పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆమె రాక‌ను కోరుకుంటున్నారా ? ఆమె టీడీపీలోకి వ‌స్తే.. [more]

Update: 2020-11-15 15:30 GMT

కాంగ్రెస్ నాయ‌కురాలు, సీనియ‌ర్ మ‌హిళా నేత సుంక‌ర ప‌ద్మశ్రీ.. టీడీపీలోకి చేర‌నున్నారా? పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆమె రాక‌ను కోరుకుంటున్నారా ? ఆమె టీడీపీలోకి వ‌స్తే.. కీలక స్థానం ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారా ? అంటే.. ఔన‌నే అన్న చ‌ర్చలు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో దాదాపు పుష్కర‌కాలంగా ఉన్న ప‌ద్మశ్రీ.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున కృష్ణా జిల్లా గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు. 2009 ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే ఆమె గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత సేవా కార్యక్రమాల‌తో దూసుకుపోయారు. అయినా.. ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు.

ఎంతమంది పార్టీని వీడినా…..

దీంతో ఒకింత మ‌న‌స్థాపానికి గురైనా.. కాంగ్రెస్‌ను వీడ‌లేదు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నుంచి అనేక మంది సీనియ‌ర్లు, జూనియ‌ర్లు కూడా పార్టీ మారిపోయినా.. సుంక‌ర ప‌ద్మశ్రీ మాత్రంపార్టీలోనే కొన‌సాగారు. 2014లోనూ గ‌న్నవ‌రం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున ప‌ద్మశ్రీ పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఆమెకు కేవ‌లం 1.29 శాతం ఓట్లు మాత్రమే పోల‌య్యాయి. అయినా కాంగ్రెస్‌ను వీడ‌కుండా పార్టీలోనే ఉంటున్నారు. ఇక‌, కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోవ‌డంతో ప‌ద్మశ్రీ భ‌విత‌వ్యం ఇబ్బందుల్లో ప‌డింది.

రాజధాని ఉద్యమంలో…..

పైగా.. అప్పటి టీడీపీ నేత వ‌ల్లభ‌నేని వంశీతో ఆమె రాజ‌కీయంగా ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఢీ కొట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ సుంకర ప‌ద్మశ్రీ త‌ర‌ఫున ఎవ‌రూ అండ‌గా నిల‌బ‌డ‌లేదు. దీంతో ఆమె అప్పట్లోనే టీడీపీలోకి జంప్ చేస్తార‌నే ప్రచారం సాగింది. కానీ, కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఇక‌, అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్యమం ప్రారంభమైన త‌ర్వాత‌.. సుంక‌ర ప‌ద్మశ్రీ దూకుడు పెంచారు. మంచి వాయిస్ వినిపిస్తున్నారు. రాజ‌ధాని ఉద్యమంలో బ‌లంగా వాయిస్ వినిపిస్తోన్న ఒక‌రిద్దరు మ‌హిళా నేత‌ల్లో ప‌ద్మశ్రీ కూడా ఒక‌రు.

కాంగ్రెస్ ను వీడేందుకు….

దీంతో టీడీపీ ఇప్పుడు ఆమెను కోరుకుంటున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. సామాజికంగాను, ఆర్థికంగాను బ‌ల‌మైన వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు కావ‌డం, గ‌ట్టి వాయిస్ వినిపిస్తుండ‌డం టీడీపీకి క‌లిసి వ‌స్తుంద‌న్న లెక్కలు ఆ పార్టీ అధిష్టానం వేసుకుంటోంది. ఇక‌, కాంగ్రెస్‌ను వ‌దులుకునేందుకు ప‌ద్మశ్రీకి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. టికెట్ విష‌యంలో కాంగ్రెస్ వేధించ‌డం, ఇత‌ర పార్టీల నుంచి త‌న‌పై విమ‌ర్శలు వ‌చ్చినా కాంగ్రెస్ నేత‌లు పెద‌వి విప్పక‌పోవ‌డం.. ఇటీవ‌ల బీజేపీ నేత ఒక‌రు ప‌ద్మశ్రీ క‌ట్టుకున్న చీర‌పై తీవ్ర విమ‌ర్శలు చేసినా.. కాంగ్రెస్ నేత‌లు ఆశించిన స్థాయిలో స్పందించ‌లేదు.

గన్నవరం ఇన్ ఛార్జిగా…..

అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు మాత్రం విరుచుకుప‌డ్డారు. టీడీపీ నేత‌లు, ప‌ద్మశ్రీ మీడియా ప‌రంగా కూడా ప‌ర‌స్పర స‌హాయ స‌హ‌కారాలు ఇచ్చి పుచ్చుకుంటోన్న ప‌రిస్థితి ఉంది. ఇక‌, కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అదే టీడీపీ అయితే.. కృష్ణా జిల్లా చైర్‌ప‌ర్సన్ సీటు లేదా.. గ‌న్నవ‌రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విధంగా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. వంశీ టీడీపీని వీడ‌డంతో చంద్రబాబు గ‌న్న‌వ‌రం బాధ్యత‌లు తాత్కాలికంగా ఎమ్మెల్సీ బ‌చ్చుల అర్జునుడుకు ఇచ్చారు. ప్రస్తుతం అర్జు‌నుడు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.. మ‌హిళా కోటాలో ప‌ద్మశ్రీకి ప్లస్ అవుతుంద‌ని అంటున్నారు. బ‌చ్చుల‌కు అవ‌స‌ర‌మైతే.. ఎమ్మెల్సీ రెన్యువ‌ల్ చేసే ప్రతిపాద‌న ఉంద‌ని తెలుస్తోంది. ఇక పార్టీ మార్పుపై ప‌ద్మశ్రీ నిర్ణ‌య‌మే త‌రువాయి అని తెలుస్తోంది.

Tags:    

Similar News