రాజస్థాన్ చిన్నదానికి మిస్ ఇండియా కిరీటం

మిస్ ఇండియా…. కావడం అంటే నేటి యువతరం అమ్మాయిలకు ఒక ఛాలెంజ్. ఈ పోటీకి ఎంట్రీ లెవెల్ వరకు వెళితే చాలని అనుకుంటారు చాలామంది. ఎంతో కఠోర [more]

Update: 2019-06-17 02:23 GMT

మిస్ ఇండియా…. కావడం అంటే నేటి యువతరం అమ్మాయిలకు ఒక ఛాలెంజ్. ఈ పోటీకి ఎంట్రీ లెవెల్ వరకు వెళితే చాలని అనుకుంటారు చాలామంది. ఎంతో కఠోర దీక్షతో సరైన కొలతలు మెయింటైన్ చేస్తూ అందం, ఆహార్యం తెలివి తేటలు కలిగి ఉండి అదృష్టం కూడా తోడైతేనే మిస్ ఇండియా కిరీటం దక్కుతుంది. ఆ తరువాత ప్రపంచ అందగత్తెల పోటీకి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ లభిస్తుంది. తాజాగా ముంబాయిలో ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ కనుల విందుగా సాగింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పోటీ ఆధ్యంతం ఉత్కంఠ రేపడంతో బాటు వయ్యారి భామల క్యాట్ వాక్ లతో వేడుక అదిరిపోయింది.

సుమన్ రావు కి దక్కిన అదృష్టం …

పోటాపోటీగా సాగిన మిస్ ఇండియా కిరీట పోరాటం లో రాజస్థాన్ కు చెందిన 20 ఏళ్ళ చిన్నది సుమన్ రావు అన్ని విభాగాల్లో జడ్జీల మనసు దోచి కీరిటం పట్టుకుపోయింది. ఇదే పోటీలలో ఫస్ట్ రన్నరప్ గా చత్తిస్ ఘడ్ చిన్నది శివాని జాదవ్ నిలిచింది. సెకండ్ రన్నరప్ గా తెలంగాణ కు చెందిన సంజనా విజ్ నిలవడం విశేషం. బాలీవుడ్ ప్రముఖులు హాజరైన ఈ పోటీలకు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్, 2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ జడ్జీలుగా వ్యవహరించారు. గత ఏడాది మిస్ ఇండియా తమిళనాడుకు చెందిన అను కీర్తి వాస్ చేతుల మీదుగా ఈ ఏడాది మిస్ ఇండియా సుమన్ రావు కిరీటాన్ని అందుకోవడం విశేషం.

Tags:    

Similar News