బొబ్బిలి రాజును ఫిక్స్ చేస్తున్నారా?

మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఆయనపై కేసులు నమోదుకు అంతా సిద్ధమవుతుందంటున్నారు. బొబ్బిలి రాజు కష్టాల్లోపడినట్లేనన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. బొబ్బిలిలోని [more]

Update: 2021-06-11 08:00 GMT

మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు వైసీపీకి టార్గెట్ అయ్యారు. ఆయనపై కేసులు నమోదుకు అంతా సిద్ధమవుతుందంటున్నారు. బొబ్బిలి రాజు కష్టాల్లోపడినట్లేనన్న కామెంట్స్ బాగా వినపడుతున్నాయి. బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో అవకతవకలు వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. దీంతో సుజయ కృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పేట్లు లేవన్న వ్యాఖ్యలు బలంగా విన్పిస్తున్నాయి.

కొంతకాలంగా సైలెంట్….

సుజయ కృష్ణ రంగారావు 2014 లో వైసీపీ నుంచి విజయం సాధించి టీడీపీలోకి మారిపోయారు. టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ కృష్ణ రంగారావు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తుండటం, కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటంతో సుజయ కృష్ణ రంగారావు విశాఖ, చెన్నైలకే పరిమితమయ్యారు.

మరింత వీక్ చేయాలని….

అయితే బొబ్బిలిలో సుజయ కృష్ణ రంగారావు ను మరింత వీక్ చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తుంది. ఇందుకోసం ఆయన పై విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. బొబ్బిలిలో వేణుగోపాల స్వామి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోనే ఉంది. అయినా ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతను బొబ్బిలి రాజులే చూస్తుంటారు. వారే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయానికి నాలుగు వేల ఎకరాల భూములున్నాయి. కిలోల కొద్దీ బంగారం ఉంది.

ఆలయ ఆస్తులపై?

అయితే ఆలయానికి చెందిన భూములు అన్యాక్రాంతమయినట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఆలయానికి చెందిన బంగారం కూడా బొబ్బిలి రాజుల కోట లో ఉందని చెబుతన్నారు. దీనిపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. స్వామివారి నగల విషయంలోనూ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నేరుగా సుజయ కృష్ణ రంగారావును ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. ఈ విచారణలో అవకతవకలు బయటపడితే సుజయ కృష్ణ రంగారావుకు ఇబ్బందులు తప్పవంటున్నారు.

Tags:    

Similar News