ఇక ఆ యోగం లేనట్లేనటగా?

పార్టీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకోలేదు. ఆర్ఎస్ఎస్ భావాజాలం అసలే తెలియదు. మరో ఏడాదిలో పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఆయనే [more]

Update: 2021-03-28 06:30 GMT

పార్టీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకోలేదు. ఆర్ఎస్ఎస్ భావాజాలం అసలే తెలియదు. మరో ఏడాదిలో పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ రాష్ట్రంలో జరుగుతుంది. ఆయనే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికలోనూ సుజనా చౌదరికే చంద్రబాబు కీలక బాధ్యతలను అప్పగించారు.

అంతా తానే అయి….

కేవలం అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు పార్టీకి ఆర్థిక వనరులను సమకూర్చి పెట్టడంలోనూ సుజనా చౌదరి దిట్ట. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. అందుకే ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రి కూడా కాగలిగారు. బీజేపీతో విభేదించి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆయన కూడా రాజీనామా చేయక తప్పింది కాు. అయినా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమితో సుజనా చౌదరి మరో ముగ్గురితో కలసి బీజేపీలోకి జంప్ అయ్యారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్నా…..

ఇంతవరకూ బాగానే ఉన్నా ఏడాది క్రితం వరకూ సుజనా చౌదరి బీజేపీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభలో టీడీపీని విలీనం చేయడంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ బీజేపీ కేంద్ర పెద్దల్లో ఆ ఆలోచనే లేదు. పైగా సుజనా చౌదరికి మరో సమస్య వచ్చి పడింది. వచ్చే ఏడాదితో రాజ్యసభ పదవి ముగియనుంది. ఆయనకు రెన్యువల్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి శక్తి లేదు. బీజేపీలో ఆ అవకాశం లేదు. బీజేపీలో రాజ్యసభ పదవుల పంపిణీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. పార్టీకి మొదటి నుంచి ఉపయోగపడిన నేతలకే అవకాశమిస్తారు.

మరోసారి పెద్దల సభకు…?

దీంతో సుజనా చౌదరికి రాజ్యసభ కు మళ్లీ వెళ్లే యోగం లేనట్లే. వచ్చే ఏడాది నుంచి ఎలాంటి పదవి లేకుండానే సుజనా చౌదరి కాల వెళ్లదీయాల్సి ఉంటుంది. పారిశ్రామిక వేత్త కావడంతో ఢిల్లీలో లాబీయింగ్ అవసరం. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ అవసరం ఉంది. అందుకే సుజనా చౌదరి ఎన్నికల ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తిరిగి టీడీపీలో చేరేందుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బీజేపీతో చెడకుండా టీడీపీకి ఉపయోగపడేలా ఉండేలా సుజనా చౌదరి అడుగులు వేస్తారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News