బిగ్ టాస్క్ లో సుజనా స్లిప్ అయ్యారా?

పార్క్ హయత్ హోటల్ భేటీ ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఏపీలో జరిగే ప్రతి విషయం వెనక సుజనా చౌదరి ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సుజనా చౌదరి [more]

Update: 2020-06-23 14:30 GMT

పార్క్ హయత్ హోటల్ భేటీ ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఏపీలో జరిగే ప్రతి విషయం వెనక సుజనా చౌదరి ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సుజనా చౌదరి రాజకీయంగా బీజేపీలో ఉన్నా ఆయన మనసంతా టీడీపీలోనే ఉందన్నది వాస్తవం. ఆయన బీజేపీ ఎదుగుదల కంటే టీడీపీని కాపాడుకోవడానికే ఈ ఏడాది సమయం ఎక్కువగా కష్టపడ్డారు. ఏపీ రాజధాని విషయం దగ్గర నుంచి ఢిల్లీలో న్యాయ నిపుణులను సమకూర్చేంత వరకూ సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నది వాస్తవం.

అందరూ ఆశ్చర్యపోయినా….

సుజనా చౌదరి నలుగురు రాజ్యసభ సభ్యులతో కలిసి బీజేపీలోకి వెళ్లగానే అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబుకు కుడిభుజంలా వ్యవహరించిన సుజనా చౌదరి పార్టీని విడిచి వెళ్లడమేంటని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు వైసీపీలో చేరిన కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ వంటి వారిపై టీడీపీ చేస్తున్న విమర్శలు అప్పుడు చేయకపోవడంతోనే అర్థమయిపోయింది. ఇది వెల్ ప్లేడ్ డ్రామా అని. చంద్రబాబు స్కెచ్ తోనే సుజనా మిగిలిన ఎంపీలతో కలసి బీజేపీలోకి వెళ్లిపోయారు. బీజేపీ కూడా అవసరార్థం కావడంతో పార్టీ కండువా కప్పేశారు.

అనేక టాస్క్ లతో ఢిల్లీలో….

సుజనా చౌదరితో పాటు వెళ్లిన టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ నుచంద్రబాబు ఇప్పటికీ కర్నూలు టీడీపీ ఇన్ చార్జిగా కొనసాగిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. ఇక సుజనా చౌదరి మరో నాలుగేళ్లు మాత్రమే బీజేపీలో ఉంటారన్నది కాదనలేని వాస్తవం. ఈ నాలుగేళ్లు చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం నుంచి కాపాడటమే సుజనా చౌదరి ముందున్న టాస్క్. దీనిని సమర్థవంతంగా నెరవేర్చగలిగితే సుజనా చౌదరికి భవిష్యత్తులో టీడీపీలో మరింత పట్టు పెరుగుతుంది.

న్యాయ నిపుణులను కూడా…..

సుజనా చౌదరికి కూడా బీజేపీపై పెద్దగా ఆశల్లేవు. తన బ్యాంకు రుణాల ఎగవేతతో పాటు చంద్రబాబు ఛత్రంలా ఉండటమే ఆయన ముందున్న లక్ష్యం. ఆర్థిక సాయం కూడా చేస్తున్నారంటున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతతో సఖ్యతగా ఉంటున్న సుజనా చౌదరి అక్కడి నుంచి నరుక్కువస్తున్నారంటున్నారు. బీజేపీకి చంద్రబాబును చేరువ చేసే పనిలోనే ఉన్నారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో తన కేసులో వాదనలను విన్పించేందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను నియమించుకున్నారు. అయితే ఈయన ఫీజు మొత్తం సుజనా చౌదరి చెల్లిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సుజనా చౌదరి చంద్రబాబు తనకు అప్పగించే బిగ్ టాస్క్ లను పూర్తి చేసే పనిలోనే పూర్తికాలం పనిచేస్తున్నట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News