సుజనా గ్యాంగ్ కు స్మూత్ వార్మింగ్

ఒక్క నియామకం రాష్ట్ర రాజకీయాల్లో అనేకమంది నేతలను నిరుత్సాహ పర్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకంతో పార్టీ సిద్ధాంతాలకు, తొలి నుంచి పార్టీని నమ్ముకున్న [more]

Update: 2020-07-29 08:00 GMT

ఒక్క నియామకం రాష్ట్ర రాజకీయాల్లో అనేకమంది నేతలను నిరుత్సాహ పర్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకంతో పార్టీ సిద్ధాంతాలకు, తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని అధిష్టానం చెప్పకనే చెప్పింది. నిజానికి ఏపీ బీజేపీలో గత కొంతకాలంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో ఎప్పటి నుంచో ఉన్న పార్టీ నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఇది దాదాపు నాలుగేళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఏడాది కాలంగా ఎక్కువయింది.

అంతా ఆ గ్యాంగే….

ఇతర పార్టీల నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ, పురంద్రీశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలు పార్టీని డ్యామినేట్ చేస్తున్నారన్న బాధ బీజేపీ క్యాడర్ లోనూ ఉంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్లయితే వీరి రాకను ఏమాత్రం స్వాగతించలేదు. కేవలం పదవుల కోసం తప్ప వీరు పార్టీని బలోపేతం చేయడానికి రాలేదని వారు అధిష్టానానికి అనేక మార్లు ఫిర్యాదు కూడా చేశారు.

పెద్దతలకాయను కూడా…..

ప్రధానంగా సుజనా చౌదరి తో పాటు వచ్చి చేరిన నేతలు ఢిల్లీలో ఉంటూ కేంద్రపార్టీలో ఉన్న ఒక పెద్దతలకాయను కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఇక్కడి నేతలు గుర్తించారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర నాయకత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తమ అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా బలవంతంగా రుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది బీజేపీలోని ఒకవర్గం నేతలకు రుచించడం లేదు. అయనా పార్టీ అధిష్టానాన్ని థిక్కరించలేక మౌనంగా ఉన్నారు.

రామ్ మాధవ్ సూచన మేరకు…

అయితే అన్నింటిపై సమగ్ర నివేదికను తెప్పించుకున్న అధిష్టానం ఈ గ్యాంగ్ కు చెక్ పెట్టేందుకు సోము వీర్రాజును రంగంలోకి దించిందని చెబుతున్నారు. ముఖ్యంగా రామ్ మాధవ్ సలహా, సూచనలతోనే వీర్రాజు నియామకం జరిపినట్లు తెలుస్తోంది.గత కొంతకాలంగా ఏపీ బీజేపీలో కొందరు చేస్తున్న డామినేషన్ పాలిటిక్స్ కు చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే సోముకు ప్రాధాన్యత నిచ్చినట్లు సమాచారం. పైరవీలతో పనులు చక్కబెట్టుకునే సుజనా చౌదరి గ్యాంగ్ కు చెక్ పడినట్లేనని ఆ పార్టీ నేతల నుంచి విన్పిస్తున్న మాట.

Tags:    

Similar News