ప్యాకేజీలు ఈమె సేవకు ఎందుకూ సాటిరావు

సుధా నారాయణ ముార్తి …. పరిచయం అక్కర లేని పేరు. దిగ్గజ పోటీసంస్ధ ఇన్ఫోసిస్ అధినేత ఆర్. నారాయణముార్తి సహధర్మచారిణి, వేల కోట్లరుాపాయల ఆస్తులకు అధిపతి. ఆమె [more]

Update: 2020-05-29 16:30 GMT

సుధా నారాయణ ముార్తి …. పరిచయం అక్కర లేని పేరు. దిగ్గజ పోటీసంస్ధ ఇన్ఫోసిస్ అధినేత ఆర్. నారాయణముార్తి సహధర్మచారిణి, వేల కోట్లరుాపాయల ఆస్తులకు అధిపతి. ఆమె ఆర్ధికంగా ఎంత సంపన్నురాలో, ఆలోచనాపరంగా అంత పెద్ద మనసున్న మహిళ. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. అవసరంలో ఉన్న, ఆపదలో ఉన్నవారికి, ఆపన్నులకు అన్నివిధాలా అండగా ఉంటారు. నారాయణముార్తి ఫౌండేషన్ ద్వారా చేతనైన సాయం చేయడమే ఆమె లక్షం. మామూలుగా సేవాకార్యక్రమాల్లో తలమునకలయ్యే సుధా నారాయణముార్తి ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఆపన్నులను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. లక్షల కుటుంబాలకు ఆహారం, వేల కుటుంబాలకు చేయుాత, దినసరి కుాలీలకు భరోసా కలిగించడంలో బిజీగా మారారు.

సేవలతోనే బిజీగా గడుపుతూ….

కరోనా ప్రారంభదశలో ఉన్నప్పుడు బెంగళుారులో వంద గదుల ఆస్పత్రి నిర్మిస్తానని సుధా నారాయణ ముార్తి మాట ఇచ్చారు. ఈ మేరకు కొద్దిరోజుల్లోనే క్వారంటైన్ ఆసుపత్రిని నిర్మించారు. కర్ణాటక రాజధాని బెంగుళుారులోని నారాయణ హెల్త్ సిటీలో దీనిని ఇటీవల ప్రారంబించడం విశేషం. మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చుాడడం సుధా నారయణ మూర్తి నైజం. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ కిట్లు, మాస్కులు, ఇతర సామగ్రిని అందజేసేందుకుసుధా నారాయణ ముార్తి ముందుకు వచ్చారు. ఈ హామీని కార్యరుాపం దాల్చేందుకు ప్రస్తుతం ఆమె శ్రమిస్తున్నారు. కేవలం క్వారంటైన్ సెంటర్, ఆస్పత్రుల బలోపేతానికి ఆమె పరిమితం కాలేదు. ప్రధానమంత్రి సహాయనిధికి రు.50 కోట్లు అందచేశారు. 142 వెంటీలేటర్లు, 26 మల్టీపారా పేషెంట్స్ మానిటర్స్, 14 వేల లీటర్ల శానిటైజర్లు, 40 వేల పి.పి.ఇ లు రెండున్నర లక్షల చేతితొడుగులు, 32 వేల ఎన్ 95 మాస్కులు, అందించారు. రెండు వైద్యశాలల్లో ఆక్సిజన్ పైప్ లైన్ సౌకర్యం కల్పించారు. నిరుపేదలకు ప్రత్యక్షంగా సాయం చేశారు. లక్షల కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. ఆహార పదార్ధాలు, భోజనాలు, క్షేత్రస్ధాయిలో ఎక్కడ అవసరమెా అక్కడ గుర్తించి నారాయణముార్తి ఫౌండేషన్ ద్వారా సుధా నారాయణ ముార్తి అందిస్తున్నారు. దాతృత్వంలో ఎప్పుడూ సుధాముార్తి ముందుంటారు. ఎలాంటి విపత్తులు వచ్చినా బాధితులను ఆదుకునేందుకు నారాయణముార్తి ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తారు.

మధ్యతరగతి కుటుంబం నుంచి….

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1950 ఆగస్టు 19న జన్మించిన సుధ కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఇండియన్ ఇనిస్టిట్యుాట్ ఆఫ్ సైన్స్ లో ఎంటెక్ చేశారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1978 లో నారాయణముార్తిని వివాహం చేసుకున్నారు. కుమారుడు రోహన్, కుమార్తె అక్షత. ఆమె అల్లుడు రిషీ సునాక్ బ్రిటన్ ఆర్ధికమంత్రిగా కీలక స్ధాయిలో ఉన్నారు. సుధా టెక్ లో ఇంజినీరుగా ప్రస్ధానాన్ని ప్రారంభించారు. పుాణె, ముంబయి, జంషెడ్ పూర్ లలో వివిధ హోదాల్లో సేవలు అందించి పేరుప్రతిష్టలు తెచ్చుకున్నారు. 1996 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్ధాపించి, దానికి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. గేట్స్ ఫౌండేషన్ లో కుాడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనాధ ఆశ్రమాలకు ఆర్ధికసాయం అందచేస్తున్నారు.

కార్పొరేట్ ప్రపంచంలోనే…

కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్, గ్రధాలయ సౌకర్యాలను తమ ఫౌండేషన్ ద్వారా సుధా నారాయణ ముార్తి కల్పించారు. హార్వర్డ్ విశ్వవిధ్యాలయంలో ముార్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. 1995 లో బెంగుళుారు రోటరీ క్లబ్ నుంచీ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు అందుకున్నారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంపై మంచి పట్టుంది. విశేష ప్రతిభ, సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా నాటి రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కాలాం నుంచి ప్రతిష్టాత్మకమైన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్ధి దశలో ఇంజనీరింగ్ లో మంచి మార్కులు సాధించినందుకు ఏడోదశకంలో నాటి ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ నుంచి సుధ అవార్డు అందుకున్నారు. షౌండేషన్ ద్వారా తుఫాను బాధిత ప్రాంతాల్లో 2300 పక్కా గృ‍హాలు నిర్మించారు. విద్య, ఆరోగ్య, మహిళా సాధికారత, సాంస్కృతిక రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 70 వేల పాఠశాలల్లో గ్రంధాలయాలు ఏర్పాటు చేశారు. బెంగళుారు తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మరుగుదొడ్లు నిర్మించారు. తమిళనాడులో సునామి, గుజరాత్ లో భూకంపం, ఒడిశాలో తుఫాను, ఏపీ,కర్ణాటక, మహారాష్ట్రాల్లోని కరవు ప్రాంతాల్లో సహాయం అందించారు. సేవా కార్యక్రమాలను కొనసాగించడం, విస్తరించడం, ద్వారా సుధా నారాయణ మూర్తి కార్పోరేట్ ప్రంపంచానికి మార్గదర్శిగా నిలిచారు. ఎక్కువమందికి స్పుార్తిగా నిలిచారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News