డిసెంబర్ లో దడ దడేనట

ఒకవైపు రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినా భారత్ లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి ఆగదని అధ్యయన సంస్థలు వెల్లడిస్తున్నాయి. డిసెంబరు నాటికి భారత్ లో [more]

Update: 2020-08-16 18:29 GMT

ఒకవైపు రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినా భారత్ లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి ఆగదని అధ్యయన సంస్థలు వెల్లడిస్తున్నాయి. డిసెంబరు నాటికి భారత్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వివిధ అధ్యయన సంస్థలు వెల్లడించాయి. డిసెంబర్ నాటికి భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటే అవకాశముందని తేల్చాయి. రికవరీ రేటు ఎక్కువగా ఉన్నా మరణాలు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రపంచంలోనే ఎక్కువగా…..

కరోనా వైరస్ విషయంలో డిసెంబరు నాటికి భారత్ అమెరికా, బ్రెజిల్ ను దాటేస్తుందని చెబుతున్నారు. భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ముప్ఫయి లక్షలకు చేరువలో ఉన్నాయి. మరణాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగులను తక్షణమే గుర్తించేలా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలని కోరింది. ఇటీవల ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

పది రాష్ట్రాల్లోనే…..

ప్రధానంగా పది రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, రాజస్థాన్ లో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ కేసులు, ఎక్కువ మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాలు ఐదు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ లను హాట్ స్పాట్ లుగా గుర్తించారు.

టెస్ట్ ల సంఖ్య పెంచి…..

ఈ రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్య పెంచి కరోనాను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కేంద్ర బృందాలను పంపి పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. భారత్ లో ప్రస్తుతం రికవరీ రేటు 70 శాతం ఉండటంతో దానిని మరింత పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. మొత్తం మీద వ్యాక్సిన్ వచ్చేలోపు లక్షలాది మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, డిసెంబరు నాటికి కోటి దాటతాయని నిపుణల హెచ్చరికతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమయింది. కేవలం ప్రభుత్వ చర్యలే కాకుండా ప్రజలు కూడా కరోనాకట్టడికి సహకరించాల్సి ఉంది.

Tags:    

Similar News