ఏపీలో అవన్నీ సేఫ్ లోనే ఉన్నాయట… అందుకే?

ఆంధ్రప్రదేశ్ లో 579 మండలాలు సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఏపీలో గణనీయంగా పెరుగుతున్నా అవి కేవలం [more]

Update: 2020-04-27 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో 579 మండలాలు సేఫ్ పొజిషన్ లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఏపీలో గణనీయంగా పెరుగుతున్నా అవి కేవలం 97 మండలాలకే పరిమితమయ్యాయి. మిగిలిన 79 మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కాలేదు. దీంతో లాక్ డౌన్ నిబంధనలను అక్కడ సడలించాలని ప్రభుత్వం గత కొద్ది రోజులుగా యోచిస్తుంది.

పట్టణాలు, నగరాల్లోనే?

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాలు, నగరాలు మాత్రమే కరోనా వైరస్ కు ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడే వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందింది. భౌతిక దూరం పాటించకపోవడం, ఇతర దేశాలు, మర్కజ్ ప్రార్థనల నుంచి వచ్చిన వారు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాల్లోనే ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా విజయవాడ, కర్నూలు, నెల్లూరు, గుంటూరు వంటి నగరాలు కరోనా బారిన ఎక్కువగా పడ్డాయి.

రెడ్ జోన్ గా ప్రకటించిన….

ఆంధ్రప్రదేశ్ లో 97 మండలాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కడప, కృష్ణా, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువగా పట్టణాల్లోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మండల కేంద్రాల్లోనూ వ్యాపించిందని గమనించిన ప్రభుత్వం మొత్తం 97 మండలాలను రెడ్ జోన్లుగా ప్రకటించింది. వీటిలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తుంది.

విడతల వారీగా…..

అయితే 97 మండాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలకు ఎలాంటి మినహాయింపులను ప్రభుత్వం ఇవ్వలేదు. పథ్నాలుగు రోజుల పాటు ఈ రెడ్ జోన్ లలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాకుంటే తొలుత ఆ మండలాన్ని ఆరెంజ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఆ తర్వాత మరో పథ్నాలుగు రోజులు ఎలాంటి కేసులు నమోదు కాకుంటే గ్రీన్ జోన్ కింద ప్రకటిస్తారు. అప్పుడే ఆ మండలాల్లో లాక్ డౌన్ మినహాయింపులు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. 97 మండలాలపైనే ఇప్పుడు ఏపీ సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ కరోనాను కంట్రోల్ చేయగలిగితే సక్సెస్ అయినట్లే.

Tags:    

Similar News