స్టాలిన్ లో ఇప్పుడు కలవరం మొదలయిందట

తమిళనాడు ఎన్నికలు హీట్ ను పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలూ కూటములతో ముందుకు వెళుతున్నాయి. అయితే స్టాలిన్ తన డీఎంకే అభ్యర్థుల గెలుపుపైనే ఎక్కువ దృష్టి [more]

Update: 2021-04-10 17:30 GMT

తమిళనాడు ఎన్నికలు హీట్ ను పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలూ కూటములతో ముందుకు వెళుతున్నాయి. అయితే స్టాలిన్ తన డీఎంకే అభ్యర్థుల గెలుపుపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కేటాయించిన స్థానాల్లోనే పరిమితమయింది. కాంగ్రెస్ అగ్రనేతలు తమకు కేటాయించిన స్థానాల్లోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యనే ఉంది.

అధికారం తమదేనన్న….

అయితే ఎవరు గెలుస్తారన్నది ఖచ్చితంగా చెప్పలేం. డీఎంకే అధినేత స్టాలిన్ కు మాత్రం అధికారం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. తానే ముఖ్యమంత్రినని ఆయన విశ్వాసంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చినా మిత్రపక్షాలపై ఆధారపడకుండా ఉండాలన్నది స్టాలిన్ భావన. అందుకే తొలి నుంచి స్టాలిన్ మిత్రపక్షాలకు తక్కువ స్థానాలను కేటాయిస్తామని చెబుతూనే వచ్చారు. ఆ మేరకే మిత్రపక్షాల అసంతృప్తిని పట్టించుకోకుండా తక్కువ స్థానాలను కేటాయించారు.

కాంగ్రెస్ తనకు కేటాయించిన…..

కానీ ఊహించినంత అసంతృప్తి మిత్రపక్షాల నుంచి రాలేదు. కాంగ్రెస్ కు స్టాలిన్ కేవలం 25 సీట్లను మాత్రమే కేటాయించారు. కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. గతంలో తమకు కేటాయించిన స్థానాల్లో ఇప్పుడు డీఎంకే పోటీ చేస్తున్నా వారికి సహకరించడం లేదన్న నివేదికలు స్టాలిన్ కు అందాయి.

సహకారం లేకుంటే….?

ఇది కొంచెం కలవరపర్చే అంశమే. ఎందుకంటే తక్కువ స్థానాలను కేటాయించడంతో మిత్రపక్షాలు డీఎంకే పోటీ చేసే స్థానాల్లో సహకరించకపోతే గెలుపు అవకాశాలు తక్కువగానే ఉంటాయి. అందుకే పదే పదే స్టాలిన్ మిత్రపక్షాల నేతలతో సమావేశమవుతున్నారు. సహకారం అందించాలని కోరుతున్నారు. ఇరువైపుల నుంచి సహకారం అందితేనే అధికారం సాధ్మమవుతుందని స్టాలిన్ వారికి పదే పదే గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద అసంతృప్తి బయటకు కనపడకపోయినా సహకారం కొరవడితే పరిస్థితి ఏంటన్న కలవరం స్టాలిన్ ను వెంటాడుతుంది.

Tags:    

Similar News