అందుకే స్టాలిన్ ను మెచ్చుకుంటున్నారు

స్టాలిన్ తమిళనాట కుదురుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటి వరకూ సక్సెస్ అయినట్లే చెప్పాలి. రాజకీయంగా కాకుండా స్టాలిన్ అభివృద్ధిపైనే దృష్టి పెడుతుండటం అందరినీ మెప్పిస్తుంది. అందుకే స్టాలిన్ [more]

Update: 2021-09-01 16:30 GMT

స్టాలిన్ తమిళనాట కుదురుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటి వరకూ సక్సెస్ అయినట్లే చెప్పాలి. రాజకీయంగా కాకుండా స్టాలిన్ అభివృద్ధిపైనే దృష్టి పెడుతుండటం అందరినీ మెప్పిస్తుంది. అందుకే స్టాలిన్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలోనూ అత్యధిక ర్యాంకును సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికలు జరిగి కేవలం మూడు, నాలుగు నెలలు మాత్రమే అయింది. ఈ కొద్ది సమయంలోనే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

పార్టీ ఫిరాయింపులకు….

తమిళనాడు రాజకీయాలంటే గతంలో ఏవగింపుగా ఉండేవి. పార్టీ ఫిరాయింపులు కూడా జోరుగా సాగేవి. అధికారంలో ఉన్న పార్టీ కి అనేకమంది నేతలు జంప్ చేసేవారు. కానీ స్టాలిన్ డోర్లు క్లోజ్ చేశారు. తమ పార్టీకి రావాలనుకున్న వారు రాజీనామా చేసి రావాలని స్టాలిన్ షరతు విధించారు. దీంతో అన్నాడీఎంకే నుంచి డీఎంకే కు పెద్దయెత్తున వలసలు ఉంటాయని భావించిన వారికి స్టాలిన్ షాక్ ఇచ్చారు.

అందరినీ కలుపుకుంటూ…

ఇక స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే సమయానికి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సమయంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించడం కూడా అందరి ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు కక్ష సాధింపు చర్యలకు స్టాలిన్ దిగకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

కక్ష సాధింపు చర్యలు….

గతంలో తమిళనాడు అంటే కేసులు, కౌంటర్ కేసులు ఉండేవి. విపక్ష నేతలపై కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. జయలలిత, కరుణానిధి సమయంలో మరింత ఎక్కువగా ఈ సీన్లు కన్పించేవి. కానీ స్టాలిన్ ఈ సంప్రదాయానికి కూడా చెక్ పెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి పెట్టిన స్టాలిన్ విపక్షాలను స్నేహ పూర్వకంగా చూడటం అందరినీ ఆకట్టుకుంది. అందుకే స్టాలిన్ పట్ల ప్రజలు మొగ్గు చూపారు.

Tags:    

Similar News