ఆశలు ఆవిరి కాకుండా ఉండాలంటే?

తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా డీఎంకే ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవడం [more]

Update: 2020-10-18 18:29 GMT

తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా డీఎంకే ఈ ఎన్నికల్లో ఎన్నో ఆశలు పెట్టుకుంది. దాదాపు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే డీఎంకే కు ఒకే ఒక డిజట్వాంజీ కూటమిలోని పార్టీలే కావడం విశేషం. స్టాలిన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. తీసుకుంటున్నారు. అయితే కూటమి పార్టీల నుంచి వస్తున్న వత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారు.

సొంతబలంతోనే…..

నిజానికి డీఎంకే సొంత బలంతో ఎక్కువ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ లున్నాయి. ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు ఉంది. అయినా కొన్ని రాజకీయ కారణాలతో ఆ పార్టీలను కూటమిలో ఉంచుకోవాల్సి వచ్చింది. స్టాలిన్ ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వదులుకోవడం స్టాలిన్ కు ఇష్టం లేదు. అలాగే కాంగ్రెస్ కూడా డీఎంకే వెంట నడిచేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంది.

కాంగ్రెస్ కు స్థానాలు….

అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41 స్థానాలను కేటాయిస్తే కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇందుకోసమే ఈసారి తక్కువ స్థానాలను ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముప్ఫయికి మించి సీట్లు ఇవ్వలేమని డీఎంకే అధినేత స్టాలిన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో కంటే ఎక్కువగా 60 స్థానాలు కావాలని కోరుకుంటుంది. మధ్యే మార్గంగా గత ఎన్నికల్లో ఇచ్చిన సీట్లనే కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.

గుర్తు విషయంలో…..

స్టాలిన్ మరో ప్రతిపాదనను కూడా కూటమి పార్టీల ముందు ఉంచారు. తాము 200 స్థానాల్లో పోటీ చేయాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు తమ పార్టీ గుర్తుపైనే పోటీ చేయాలని స్టాలిన్ షరతు విధిస్తున్నారు. దీనికి చిన్న పార్టీలు అంగీకరించడం లేదు. తమ అస్తిత్వం దెబ్బతింటుందని ఆ పార్టీలు భావిస్తుండగా, స్టాలిన్ మాత్రం తమ గుర్తు విజయాన్ని సాధించిపెడుతుందని నమ్ముతున్నారు. మొత్తం మీద ఒకరినొకరు వదులుకోలేని పరిస్థితి. అలాగని ఊరుకోలేని పరిస్థితి డీఎంకే కూటమిలో నెలకొంది. మరి స్టాలిన్ ఎలా పరిష్కరించగలుగుతారో చూడాలి.

Tags:    

Similar News