శ్రీ భరత్ బిల్డింగ్ దాటి బయటకు రావడం లేదటగా?

నందమూరి కుటుంబంతో బంధం ఉన్న లీడర్. టాప్ లీడర్ తో బంధుత్వం. బాలయ్య బాబు అల్లుడు. ఆయనే శ్రీభరత్. గత ఏడాదిన్నర కాలం నుంచి శ్రీ భరత్ [more]

Update: 2020-08-26 06:30 GMT

నందమూరి కుటుంబంతో బంధం ఉన్న లీడర్. టాప్ లీడర్ తో బంధుత్వం. బాలయ్య బాబు అల్లుడు. ఆయనే శ్రీభరత్. గత ఏడాదిన్నర కాలం నుంచి శ్రీ భరత్ కన్పించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కూడా శ్రీ భరత్ లైట్ గా తీసుకుంటున్నారు. విశాఖ తెలుగుదేశం పార్టీలో ఇది చర్చనీయాంశంగా మారింది. వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయమా? లేక పార్టీ పెద్దలతోనే పొసగకపోవడమా? అన్న కారణం తెలియాల్సి ఉంది.

స్వల్ప ఓట్ల తేడాతో…..

2019 ఎన్నికల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీభరత్ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం 4,400 స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. శ్రీభరత్ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వారసడిగా రాజకీయాల్లోకి వచ్చారు. మూర్తి మరణంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. బాలకృష్ణ చిన్న అల్లుడు. లోకేష‌ కు కో -బ్రదర్. ఇన్ని సంబంధాలున్నా ఆయనకు మొన్నటి ఎన్నికల్లో కోరుకున్న టిక్కెట్ రాలేదని శ్రీ భరత్ అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినపడుతుంది.

తాను అడిగిన టిక్కెట్…..

శ్రీభరత్ భీమిలి నియోజకవర్గం టిక్కెట్ ను అడిగారు. విశాఖ ఉత్తరం టిక్కెట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషం వరకూ వెయిట్ చేయించి ఆఖకు విశాఖ ఎంపీ టిక్కెట్ ఇవ్వడంతో శ్రీభరత్ మనస్తాపానికి గురయ్యారు. ఎన్నికల్లో విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినా తాను గెలవకపోవడం వెనక టీడీపీ పెద్ద నేతలు ఉన్నారన్నది శ్రీభరత్ అనుమానం. అందుకే శ్రీభరత్ కొద్దిరోజులుగా అంటీ ముట్టన్నట్లు ఉంటున్నారు.

ఏ ఆందోళనలోనూ…

దీంతో పాటు రాజధాని భూముల వ్యవహారంలోనూ ఈ కుటుంబం పేరు బయటకు వచ్చింది. ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే విశాఖలో జరుగుతున్న ఏ ఆందోళన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. విశాఖలోనే ఉండి గీతం యూనివర్సిటీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుపై కేసులు పెట్టినా శ్రీభరత్ స్పందించలేదు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. మొత్తం మీద చంద్రబాబు బంధువే పార్టీకి దూరంగా ఉండటం మిగిలిని నేతలకు కూడా అలుసుగా మారుతుందన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News