తిప్పరా మీసం మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెనెర్జీ, నవీన్ నేని తదితరులు సినిమాటోగ్రఫర్: సిధ్ ఎడిటింగ్: ధర్మేంద్ర సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత‌లు: రిజ్వాన్ దర్శకత్వం: [more]

Update: 2019-11-08 10:16 GMT

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి, బెనెర్జీ, నవీన్ నేని తదితరులు
సినిమాటోగ్రఫర్: సిధ్
ఎడిటింగ్: ధర్మేంద్ర
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత‌లు: రిజ్వాన్
దర్శకత్వం: కృష్ణ విజయ్ఎల్

నారా రోహిత్ ఫ్రెండ్ గా సినిమాల్లోకొచ్చిన శ్రీ విష్ణు తనకంటూ హీరోగా ఓ ఇమేజ్ ని సెట్ చేసుకున్నాడు . అసలు పోయి కొసరు హైలెట్ అయ్యింది అంటే… అది నారా రోహిత్, శ్రీ విష్ణు ల విషయంలో జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నారా రోహిత్ హీరోగా కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే.. శ్రీ విష్ణు మాత్రం హీరో గా నిలబడిపోయాడనే చెప్పాలి. నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరు సినిమాలతో పిచ్చ క్రేజ్ సంపాదించిన శ్రీ విష్ణు.. ఇప్పుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో తిప్పరా మీసం అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటించే శ్రీ విష్ణు.. ఈ సినిమాలో కాస్త రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కథల్లో వేరియేషన్స్ కోరుకునే శ్రీ విష్ణు ఈ తిప్పరా మీసం సినిమాతో మల్లి హిట్ కొట్టేస్తాడని, ఆ సినిమా ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో శ్రీ విష్ణు మల్లి హిట్ కొట్టాడా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:
మణిశంకర్ (శ్రీవిష్ణు) ఒక పబ్ లో డీజే గా పని చేస్తుంటాడు. అదే విధంగా చిన్న తనంలోనే డ్రగ్స్ కి అడిక్ట్ అయి.. జల్సాలకు అలవాటు పడి విపరీతంగా బెట్టింగ్స్ చేస్తుంటాడు. ఆ క్రమంలో తన తల్లి(రోహిణి) పైనే ద్వేషం పెంచుకుని ఆమెను శత్రువులా చూస్తుంటాడు. మరోపక్క మౌనిక (నిక్కీ తంబోలి)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్స్ కు అలవాటు పడ్డ మణిశంకర్ జీవితం ఒక్కసారిగా ఉహించని మలుపు తిరుగుతుంది. అసలు మణిశంకర్ లైఫ్ లో చోటు చేసుకున్న మలుపు ఏమిటి?మణిశంకర్ ఎందుకు డ్రగ్స్ అడిక్ట్ అయ్యాడు? అసలు తల్లిని అమితంగా ద్వేషించడానికి కారణం ఏమిటి? మణిశంకర్ జీవితంలో చోటు చేసుకున్న ఆ మలుపు ఏమిటి? అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.

నటీనటుల నటన:
శ్రీ విష్ణు అంటే విభిన్న పాత్రలకు పెట్టింది పేరు. నీది నాది ఒకటే కథలో పనిపాట లేక జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళలో తెలియని వ్యక్తిగా అదరగొడితే… బ్రోచేవారెవరురా లో ఆకతాయి స్టూడెంట్ గా.. ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసే కుర్రాడిగా ఇరగదీసాడు. ఏ పాత్ర ఇచ్చిన అలవోకగా చెయ్యగల శ్రీ విష్ణు.. ఈ సినిమాలో మణిశంకర్ గా అద్భుతంగా నటించాడు. ఎమోషన్ పండించడంలోను అదరగొట్టేసాడు. విష్ణు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో విష్ణు నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ నిక్కీ తంబోలి కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చింది. శ్రీ విష్ణు తల్లి పాత్ర చేసిన రోహిణి మరోసారి అద్భుత నటన ప్రదర్శించింది. కొడుకు మీద ప్రేమను వ్యక్త పరిచే ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. మిగతా నటులు పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:
దర్శకుడు కృష్ణ విజ‌య్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడు.అయితే దర్శకుడు అనుకున్న పాయింట్ ను తెరకెక్కించే క్రమంలో దానిని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎక్కువ సమయాన్నే తీసుకున్నాడు. దర్శకుడు ఎక్కువగా శ్రీ విష్ణు మీదే ఫోకస్ చేసాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక్క శ్రీవిష్ణు పాత్రనే హైలైట్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాని వల్ల శ్రీవిష్ణు నుంచి మంచి సబ్జెక్టు ఉన్న చిత్రాన్ని చూస్తున్నామన్న ప్రేక్షకుల ఫీలింగ్ మెల్లగా నీరుగారడం మొదలవుతుంది. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా ఫస్టాఫ్ లో ల్యాగ్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి. కథ సింపుల్ గా ఉన్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో మారే సన్నివేశాల క్రమం మరియు క్లైమాక్స్ అలాగే మెయిన్ గా హీరో తల్లి దగ్గరకి వచ్చి క్షమాపణ కోరే సీన్ చాల బాగుంది. అలాగే బెట్టింగ్ సీన్స్ మరియు ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్ వంటి ఎపిసోడ్స్ కాస్త ఆసక్తికరంగా అనిపించించినా ఓవరాల్ గా సినిమా మాత్రం ఓకె ఓకె గా అనిపిస్తుంది.

సాంకేతికంగా
సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి సినిమాకు ప్లస్ అయ్యాడనే చెప్పాలి.కేవలం పాటలు మాత్రమే కాకుండా మంచి నేపధ్య సంగీతం కూడా అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా తెరకెక్కించాడు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది. ఇక నిర్మాణ విలువలు కథానుసారంగా వున్నాయి.

రేటింగ్: 2.0/5

Tags:    

Similar News