రెడ్డి గారి కుటుంబం రాజ‌కీయాల్లో ఉన్నట్లేనటగా ?

సాధార‌ణంగా రాజ‌కీయాలు ఒక‌సారి అల‌వాటైతే.. అంత త్వర‌గా వ‌దిలిపోవ‌ని అంటారు. త‌ర‌త‌రాలుగా రాజ‌కీయాలు చేస్తున్న కుటుంబాలు మ‌న రాష్ట్రంలోను, దేశంలోను మ‌న‌కు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. అయితే.. క‌ర్నూలు [more]

Update: 2021-06-09 03:30 GMT

సాధార‌ణంగా రాజ‌కీయాలు ఒక‌సారి అల‌వాటైతే.. అంత త్వర‌గా వ‌దిలిపోవ‌ని అంటారు. త‌ర‌త‌రాలుగా రాజ‌కీయాలు చేస్తున్న కుటుంబాలు మ‌న రాష్ట్రంలోను, దేశంలోను మ‌న‌కు ఎక్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. అయితే.. క‌ర్నూలు జిల్లాకుచెందిన మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం ప‌రిస్థితి ఏంటి ? సుదీర్ఘకాలం పాటు.. రాజ‌కీయాలు చేసిన ఎస్పీవై రెడ్డి.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌ ఎంపీగా అనేక సార్లు విజ‌యం సాధించారు. నంద్యాల ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేసి ఓడిన ఆయ‌న ఆ త‌ర్వాత ఎంపీగా మాత్రం వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌చ్చారు. ప్రఖ్యాత నంది పైపుల గ్రూప్ సంస్థల చైర్మ‌న్‌గా తెలుగు పారిశ్రామిక వేత్త‌ల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

పార్టీలు మారి….?

గ‌తంలో కాంగ్రెస్‌లోను.. 2014లో జ‌రిగిన రాష్ట్ర విభ‌‌జ‌న త‌ర్వాత‌ ఎస్పీవై రెడ్డి వైసీపీ త‌ర‌పున విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆ వెంట‌నే వైసీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో.. వెనువెంట‌నే వెళ్లి టీడీపీలో చేరిపోయారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నుంచి టికెట్ రాద‌ని తెల‌వ‌డంతో.. వెంట‌నే జంకు గొంకు లేకుండానే జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీ టికెట్ సాధించి.. జ‌న‌సేన పార్టీ గుర్తుపై పోటీ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. వీల్ చైర్‌పైనే ప్రచారం చేశారు. విచిత్రం ఏంటంటే గ‌త ఎన్నిక‌ల్లో ఎస్పీవై రెడ్డి జ‌న‌సేన త‌ర‌పున నంద్యాల ఎంపీగా పోటీ చేస్తే ఆయ‌న ఇద్దరు కుమార్తెలు, అల్లుడు కూడా ముగ్గురూ నంద్యాల‌, శ్రీశైలం, మంత్రాల‌యం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు.

ఆయన మృతితో…..

ఈ ఫ్యామిలీ ప్యాక్ ఆఫ‌ర్ అప్పట్లో పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, ఎన్నిక‌లు ముగిసిన రెండు రోజుల్లోనే అంటే.. ఫ‌లితాలు కూడా రాకుండానే ఎస్పీవై రెడ్డి మృతి చెందారు. ఆ ఫ‌లితాల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఈ కుటుంబం నుంచి ఎస్పీవై రెడ్డి బ‌తికి ఉన్న స‌మ‌యంలోనే త‌న రాజ‌కీయ వార‌సులుగా కుమార్తె సుజ‌ల‌, అల్లుడు శ్రీధ‌ర్‌ర‌డ్డిలను హైలెట్ చేసేందుకు ఆయ‌న ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. 2017లో వ‌చ్చిన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో అల్లుడు శ్రీధ‌ర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయ‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు.

జనసేనలోనే ఉన్నారట…….

తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత‌.. అటు కుమార్తె, ఇటు అల్లుడు కూడా ఎక్కడా రాజ‌కీయాల్లో క‌నిపించ‌డం లేదు. స‌రే.. ఇప్పుడు వీరు ఏ పార్టీలో ఉన్నారు? ఏం చేస్తున్నార‌ని.. బీజేపీ నేత‌లు ఆరాతీయ‌డంతో తాజాగా మ‌రోసారి ఎస్పీవై రెడ్డి కుటుంబం గురించి రాజ‌కీయా ల్లో చ‌ర్చ వ‌చ్చింది. ప్రస్తుతం తాము జ‌న‌సేన‌లోనే ఉన్నామ‌ని.. వారు చెప్పడం గ‌మ‌నార్హం. మ‌రి ప్రజ‌ల్లో లేరు క‌దా.. అనే ప్రశ్నకు సుజ‌ల.. అవ‌స‌రం ఉన్నప్పుడు వ‌స్తామ‌ని చెప్పుకొచ్చారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ తెర‌మీద‌కి వ‌స్తామ‌ని చెప్పిన‌ట్టేన‌ని అన్న చ‌ర్చలు న‌డుస్తున్నా… వీరి రాజ‌కీయ వైభోగం ఎస్పీవై రెడ్డితోనే ముగిసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు.

Tags:    

Similar News