పగబట్టినట్లే ఉంది… సెప్బంబరులో సీన్ సితారేనట

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కన్నా గతంలో కన్నా ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. [more]

Update: 2020-09-11 18:29 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కన్నా గతంలో కన్నా ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందువల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం, నిపుణుల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా ఆందోళన ఎక్కువవుతుంది.

ఆ ఐదు రాష్ట్రాల్లోనే…..

ఇప్పటికే భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై లక్షలు దాటాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మహారాష్ట్ర, తమిళనాడు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య కొంచెం తక్కువేనని చెప్పాలి.

ఆగస్టు నెల అదరగొట్టింది….

ఆగస్టు నెల భారత్ ను భయపెట్టిందనే చెప్పాలి. ఒక్క ఆగస్టు నెలలోనే 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టు చివరి వారంలో అత్యధికంగా ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో సామాజిక వ్యాప్తి ప్రారంభమయిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జులై చివరి నాటికి 17 లక్షల కేసులు నమోదయితే ఆగస్టు చివరి నాటికి 37 లక్షలకు కేసులు చేరుకోవడం గమనార్హం.

సెప్టంబరులో పీక్ స్టేజీకి…..

ఇక సెప్టంబరు నెలలో కరోనా వైరస్ పీక్ స్టేజీ కి వెళుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు ఈ ఒక్క నెలలోనే ముప్పయి లక్షల కేసులు నమోదయినా ఆశ్చర్యం లేదు. అంటే సెప్టంబరు చివరి నాటికి భారత్ 70 లక్షలు దాటేస్తుందన్న మాట. ప్రతి నగరంలో ఒకశాతం మందికి కరోనా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయడంతో సెప్టంబరు నెలలో కరోనా పీక్ స్టేజీకి వెళుతుందని భావిస్తున్నారు. కానీ కేంద్రప్రభుత్వం మాత్రం సెప్టెంబరు చివరి నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News