ఆ మూడు నగరాలకు ముప్పు తప్పదట

దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అధ్యయన సంస్థలు [more]

Update: 2020-07-29 18:29 GMT

దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అధ్యయన సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. దీంతో అనేక రాష్ట్రాలు కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా రానున్న కాలంలో మూడు నగరాలకు కరోనా ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. బెంగళూరు, పూనే, హైదరాబాద్ నగరాలు భవిష్యత్ లో కరోనాకు నిలయాలుగా మారతాయంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న……

బెంగళూరు నగరాన్ని తీసుకుంటే ఇప్పటికే లాక్ డౌన్ ను విధించారు. బెంగళూరు నగరంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదవుతుండంటంతో నగరం మొత్తం ఖాళీ అయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో బెంగళూరులో లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో నగరం సగం ఖాళీ అయింది. రానున్న రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముంబయి కోలుకున్నా….

ఇక మరో నగరం పూనే. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా నమోదయింది. ఇప్పటికే మహారాష్ట్రలో మూడు లక్షలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇందులో ముంబయి నగరంలో అత్యధికంగా లక్ష కేసుల వరకూ నమోదయ్యాయి. అయితే ఇప్పుడప్పుడే ముంబయి నగరంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. అయితే పూనే నగరంలో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. అందుకే పూనేలో కఠినమైన లాక్ డౌన్ నిబంధనలను అమలుపరుస్తున్నారు.

హైదరాబాద్ లో పెరుగుతున్న…..

హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా కేసుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఇరవై ఐదు వేల కేసులు దాటాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా లాక్ డౌన్ వంటి నిర్ణయాలను కేసీఆర్ ప్రభుత్వం తీసుకోలేదు. రోజు నమోదవుతున్న కేసుల్లో 80 శాతం హైదరాబాద్ లోనే నమోదవుతుండటం విశేషం. భవిష్యత్ లో హైదరాబాద్ కు కరోనా నుంచి ముప్పు పొంచి ఉందని అధ్యయన సంస్థలు తెలియచేస్తున్నాయి. ఇప్పటి వరకూ భయపెట్టిన ముంబయి, ఢిల్లీ, చెన్నై నగరాల్లో మాత్రం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి.

Tags:    

Similar News