జనం మూడ్ మారిందా? దానికి డైవర్ట్ అయ్యారా?

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది మీడియా పరిస్థితి. ఇప్పటికే ప్రింట్ మీడియా కరోనా దెబ్బకు దగ్గుతూ తుమ్ముతూ బండి లాగించాలిసిన స్థితి. ప్రకటనల ఆదాయం పడిపోయింది. [more]

Update: 2020-04-15 16:30 GMT

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది మీడియా పరిస్థితి. ఇప్పటికే ప్రింట్ మీడియా కరోనా దెబ్బకు దగ్గుతూ తుమ్ముతూ బండి లాగించాలిసిన స్థితి. ప్రకటనల ఆదాయం పడిపోయింది. పాఠకుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. పేజీలు తగ్గించి ఉన్న తక్కువ పేజీల్లోనే మేము ఉన్నాం అని నడుపుకొస్తున్నాయి పత్రికలు.

ఎలక్ట్రానిక్ మీడియా కూడా …

ప్రింట్ మీడియా దుస్థితి అలా ఉంటె ఇక ఎలక్ట్రానిక్ మీడియా దూకుడు బాగా తగ్గిపోయింది. ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ లో సీరియల్స్ పాతవే రావడంతో వాటికి ఆదరణ లేకుండా పోయింది. సినిమాలు వచ్చే ఛానెల్స్ కి మాత్రం అంతో ఇంతో చూస్తున్నారు ప్రేక్షకులు. న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్ ప్రకటనలు బాగా తగ్గిపోయాయి. కరోనా వార్తలతో హడలి పోవడం ఎందుకని వాటిని చూసే వారు లేకుండా పోతున్నారు.

ఆధ్యాత్మిక ఛానెల్స్ కి పెరిగిన డిమాండ్ …

ఇక ఆధ్యాత్మిక ఛానెల్స్ కి ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది. ఎక్కువమంది ఈ ఛానెల్స్ నే చూస్తున్నట్లు రేటింగ్స్ సూచిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ప్రసారమైన రామాయణ, మహాభారత్ సీరియల్స్ ను దూరదర్శన్ పునః ప్రసారం చేయడం తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా వీటికి వచ్చిన ఆదరణ అందరి మతులు పోగొడుతుంది. ఐపిఎల్ కు వుండే రేటింగ్స్ తరహాలో దాదాపు 10 కోట్లమందికి పైగా ఈ సీరియల్స్ మళ్ళీ అదీ దూరదర్శన్ లో చూడటం కరోనా తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పక చెబుతుంది.

Tags:    

Similar News