ఆట సొగసు చూడతరమా

దక్షిణాఫ్రికా క్రికెట్ టీం కి షాక్ మీద షాక్ లే తగులుతున్నాయి. గత మూడు రోజుల క్రితం సౌత్ ఆఫ్రికా స్పీడ్ గన్ డారెల్ స్టయిన్ రిటైర్మెంట్ [more]

Update: 2019-08-09 02:52 GMT

దక్షిణాఫ్రికా క్రికెట్ టీం కి షాక్ మీద షాక్ లే తగులుతున్నాయి. గత మూడు రోజుల క్రితం సౌత్ ఆఫ్రికా స్పీడ్ గన్ డారెల్ స్టయిన్ రిటైర్మెంట్ ప్రకటించగా ఇప్పుడు ఆ టీం సూపర్ స్టార్ హసీం ఆ బాటనే ఎంచుకుని తన 15 ఏళ్ళ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై కొట్టేశాడు. 1983 లో జన్మించిన ఆమ్లా ప్రస్తుత వయస్సు 36 ఏళ్ళు . పొడవైన గెడ్డం తలేమో గుండు ఈ రెండు చూస్తే చాలు ఆడేది హసీం ఆమ్లా అని గుర్తు పట్టేస్తారు ప్రపంచ క్రికెట్ అభిమానులు.

భారత సంతతి వ్యక్తే …

భారత్ లోని గుజరాత్ కి నుంచి వెళ్ళి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన కన్వర్టెడ్ ముస్లిం ఆమ్లా. టెస్ట్ వన్డే, టీట్వంటీ ఇలా ఫార్మాట్ ఏదైనా చెలరేగి పరుగుల వరద పారిస్తాడు ఆమ్లా. ఇక వన్డేల్లో ఆమ్లా నెలకొల్పిన రికార్డ్ లైతే అన్ని ఇన్ని కావు. అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడు ఆమ్లా నే కావడం విశేషం. అలాంటి పరుగుల వీరుడు హసీం ఆమ్లా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ కి తాజాగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికా జట్టుకు వెన్నెముకగా నిలిచిన ఆమ్లా బ్యాటింగ్ ఇకపై లేకపోవడం ఆ జట్టుకి తీరని లోటు. అలాగే సొగసైన తన బ్యాటింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచాడు ఆమ్లా. దక్షిణాఫ్రికా క్రెకెట్ దిగ్గజాల సరసన ఒకడుగా నిలిచిన ఆమ్లా బ్యాటింగ్ కి దిగితే వికెట్ పడగొట్టడం ఎలాంటి బౌలర్ కైనా అంత ఈజీకాదు.

అనేక ప్రపంచ రికార్డ్ లు…

క్రికెట్ లోని అన్ని ఫార్మేట్ లలో ఆమ్లా అనేక ప్రపంచ రికార్డ్ లు నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వన్డే క్రికెట్ లో 2 వేల పరుగుల నుంచి 7 వేల పరుగులు అత్యంత వేగంగా సాధించిన బ్యాట్స్ మెన్ గా వరల్డ్ రికార్డ్ ఆమ్లా పేరిట వుంది. 2010 లో అటు టెస్ట్ ఇటు వన్డేల్లో ఆమ్లా ఒకే క్యాలండర్ ఏడాది లో వెయ్యి పరుగులు సాధించి అరుదైన రికార్డ్ లిఖించాడు. త్రిబుల్ సెంచరీ సాధించిన తొలి సౌత్ ఆఫ్రికన్ బ్యాట్సమెన్ ఆమ్లా నే. వన్డే, టెస్ట్ లలో 25 సెంచరీ లు బాదిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ గా ప్రపంచ క్రికెట్ లో నాలుగో క్రికెటర్ గా అరుదైన రికార్డ్ ఆమ్లా ది. ఆమ్లా అంటే అతడి విధ్వంసం ఎలా సాగేదో తెలుస్తుంది.

అన్ని ఫార్మాట్ల లోనూ …

వన్డే, టెస్ట్ లలో ఇప్పటివరకు 55 సెంచరీల తో 18000 పరుగులను అన్ని ఫార్మెట్లలో అంతర్జాతీయ స్థాయిలో సాధించాడు. ఆమ్లా పార్ట్ టైం బౌలర్ గా కూడా రాణించి ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.124 టెస్ట్ మ్యాచ్ లలో 9282 పరుగులు సాధించి 46.64 యావరేజ్ తో రాణించగా, 181 వన్డే మ్యాచ్ లలో 8113 పరుగులతో 49. 46 యావరేజ్ ను టి ట్వంటీలలో 44 మ్యాచ్ లలో 1277 పరుగులను 33. 60 సగటు తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 237 మ్యాచ్ లలో 17765 పరుగులు 48. 67 సగటు నెలకొల్పి అరుదైన క్రికెటర్ గా ఆమ్లా ఖ్యాతికెక్కాడు.

వివాదాలకు దూరంగా ఉన్నా …

క్రికెట్ ప్రపంచంలో వివాదరహితుడిగా తన కెరియర్ కొనసాగించిన ఆమ్లా పై కామెంటేటర్ గా డీన్ జోన్స్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆమ్లా ను టెర్రరిస్ట్ గా పోలుస్తూ జోన్స్ వెటకారంగా చేసిన వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా లో అభిమానులు భగ్గుమన్నారు. చివరికి జోన్స్ తన వ్యాఖ్యలకు క్షమాపణ లు చెప్పుకోవాలిసి వచ్చింది. కెరియర్ మొత్తం అద్భుత ఆటతీరుతో అనేక విజయాలను సౌత్ ఆఫ్రికాకు అందించిన ఆమ్లా లోటును భర్తీ కావడం కష్టమే. అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ తో పాటు మంచి నడవడికతో క్రికెట్ ఆటకే వన్నె తెచ్చిన హసీం ఆమ్లా ప్రపంచ క్రీడాభిమానుల కు ఒక చెరగని ముద్రను వేసాడని చెప్పొచ్చు.

Tags:    

Similar News