అందుకే సోనియా…?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణితిని ప్రదర్శించారనే చెప్పాలి. సోనియా అనుభవమే ఆమెను ఆదిశగా నడిపించిందనే చెప్పాలి. మహారాష్ట్ర పాలిటిక్స్ లో సోనియాగాంధీ తొలినుంచి అనుమానిస్తూనే [more]

Update: 2019-11-23 16:30 GMT

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణితిని ప్రదర్శించారనే చెప్పాలి. సోనియా అనుభవమే ఆమెను ఆదిశగా నడిపించిందనే చెప్పాలి. మహారాష్ట్ర పాలిటిక్స్ లో సోనియాగాంధీ తొలినుంచి అనుమానిస్తూనే వస్తున్నారు. అందుకే ఆమె నిర్ణయం తీసుకోవడంలో కావాలని జాప్యం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన, బీజేపీలు కలసి పోటీ చేసి మెజారిటీ విజయం సాధించాయి. పదవుల పంపకంలో తేడాలు రావడంతో శివసేన కాంగ్రెస్ వద్దకు పరుగులు తీసింది.

ముందు నుంచి అనుమానిస్తూ….

ఈ విషయాన్ని సోనియాగాంధీ గ్రహించి శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపే విషయంలో జాప్యం చేస్తూ వచ్చారు. తొలుత సోనియా గాంధీ మహారాష్ట్రలో తమకు దీర్ఘకాలంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను సంప్రదించారు. శరద్ పవార్ కాంగ్రెస్ కు నమ్మకమైన మిత్రుడే. అందుకే శరద్ పవార్ ఆలోచనలను కూడా సోనియాగాంధీ తెలుసుకోదలచుకుని ఆయనతో సమావేశమయ్యారు. బీజేపీ ఏదో ఒకటి చేస్తుందని తొలినుంచి సోనియా గాంధీ ఊహిస్తూనే ఉన్నారు.

చివరి నిమిషంలోనైనా….

మహారాష్ట్రలో బీజేపీకి 105 మంది, ఎన్సీపీకి 54, శివసేనకు 56, కాంగ్రెస్ కు 42 మంది సభ్యులున్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మూడు మనస్ఫూర్తిగా కలిస్తే ప్రభుత్వ ఏర్పాటు సులువే. కానీ బీజేపీ కాంగ్రెస్ శాసనసభ్యులను కొనుగోలు చేస్తారని భావించి తమ ఎమ్మెల్యేలను కట్టడి చేసుకునే పనిలో పడింది. బీజేపీ, శివసేనలు చివరి నిమిషంలోనైనా చేతులు కలుపుతాయని భావించిన సోనియా గాంధీ మద్దతు పై ఎటూ తేల్చకుండా కొన్ని రోజులు ఆపారు.

అందుకే తాత్సారం…..

అయితే తొలి నుంచి శివసేన ఎమ్మెల్యేలు బీజేపీ ట్రాప్ లోకి వెళ్లారన్న వార్తలు విన్పించాయి. కానీ అర్థరాత్రి ఎన్సీపీ ఎమ్మెల్యేలే అటు వైపు వెళ్లడం సోనియాకు కూడా షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. మరాఠా యోధుడు శరద్ పవార్ కు తెలిసే జరిగిందా? లేక తెలియక జరిగిందా? అన్నది పక్కన పెడితే ఆయన పై మాత్రం కొంత బురద పడిందనే చెప్పాలి. ఇటీవల మోదీని కలసి వచ్చిన సంఘటన కూడా ఇప్పుడు మహారాష్ట్రలో వైరల్ అవుతుంది. కానీ సోనియాగాంధీ మాత్రం శివసేనకు మద్దతిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించి తన హుందాతనాన్ని కాపాడుకున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News