ఖ‌ర్చు తేల్చండి.. సోముకు పీట‌ముడి.?

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్యల‌కు తోడు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య ఆయ‌న‌కు చుట్టుకుంది. రెండు [more]

Update: 2021-08-01 00:30 GMT

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. ఇప్పటి వ‌ర‌కు ఉన్న స‌మ‌స్యల‌కు తోడు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య ఆయ‌న‌కు చుట్టుకుంది. రెండు నెల‌ల కింద‌ట తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అదికారిణి ర‌త్నప్రభ‌ను పార్టీలోకి ఆహ్వానించి.. టికెట్ ఇచ్చింది. ఇక‌, ఆమె గెలిచిన‌ట్టే ప్రచారం చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీతో ర‌త్న ప్రభ‌.. మూడోస్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. బీజేపీ ఊహించిదానిక‌న్నా ఘోరంగా ఓడింది.

పొగడ్తలతో ముంచెత్తి…?

ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రచారం చేసినా.. కూడా ర‌త్న ప్రభ విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అయితే ప్రచారం స‌మ‌యంలోను, దీనికి ముందు టికెట్ ఇచ్చే స‌మ‌యంలోనూ.. ర‌త్నప్రభ‌కు సోము వీర్రాజు బాగానే రాజ‌కీయం నూరిపోశారు. ఇంకేముంది.. గెలిచేస్తారు.. అంటూ.. ఊద‌ర గొట్టారు. ఉద‌యం సాయంత్రం మీడియా మీటింగులు పెట్టించి.. ఆమెను పొగ‌డ్తల‌తో ముంచెత్తి.. గెలిచేసినంత ఫీలింగ్ తెచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నిక‌ల ఖర్చు కూడా బాగానే చేయించారు. అయితే.. దీనిలో పార్టీ ఇచ్చింది కేవ‌లం 25 శాత‌మేన‌ని.. మిగిలిన 75 శాతంలో పారిశ్రామిక వేత్తల నుంచి 30 ప‌ర్సంట్ వ‌చ్చింద‌ని తాజాగా లెక్కలు చూసుకున్నారు.

లెక్కలు తేలకపోవడంతో…?

మ‌రి మిగిలిన మొత్తం ప‌రిస్థితి ఏంటి ? అంటే.. అంతా అభ్యర్థి ర‌త్నప్రభ భ‌రించార‌ట‌! అప్పట్లో ఈ విష‌యంబ‌య‌ట‌కు పొక్కక‌పోయినా.. ఇప్పుడు లెక్కలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీనికి కూడా కార‌ణం ఉంది. తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత‌.. ర‌త్న ప్రభ‌ను ప‌ల‌క‌రించిన వారు క‌రువ‌య్యారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ర‌త్నప్రభ‌లో భ‌రోసా నింపి.. పార్టీలో ఏదైనా స్థానాన్ని / ప‌ద‌విని కేటాయించే అవ‌కాశం ఉన్నా ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమె ఇప్పుడు ఎన్నిక‌ల్లో చేసిన ఖ‌ర్చుల తాలూకు లెక్కలు తీసి.. సోము వీర్రాజుకు పంపిన‌ట్టు అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా లీక‌వ‌డం.. పార్టీలో సంచ‌ల‌నం రేపుతోంది.

తాను పెట్టిన ఖర్చుతో…?

సాధార‌ణంగా.. ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల‌కు పార్టీలు, అభ్యర్థులు పెట్టుకుంటాయి. ఇది స‌హ‌జ‌మే. త‌ర్వాత ఎవ‌రూ లెక్కలు అడ‌గ‌రు. అయితే.. ర‌త్న ప్రభ విష‌యంలో సోము నోరు జారార‌ని.. ఓడిపోవ‌డం అనేది లేద‌ని.. అదే జ‌రిగితే.. మీ సొమ్ములు రాబ‌ట్టే బాధ్యత నాద‌ని సోము వీర్రాజు అనడంతో ఇప్పుడు.. తాను కూడ‌బెట్టుకున్న సోమ్మును తిరిగి ఇవ్వాల‌ని.. ఆమె లేఖ రాసిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగ‌ళూరులో ఉన్న ర‌త్నప్రభ‌.. దీనిపై త్వర‌లోనే బ‌య‌ట‌కు వ‌స్తార‌ని కూడా తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News