వీర్రాజు గారి బండి వెనక్కెళుతోంది…?

బీజేపీకి కొత్త కొత్వాల్ గా వీర్రాజు వచ్చారు. ఇకనేం దూసుకుపోతుంది అని అంతా అనుకున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకుని నోటాను [more]

Update: 2020-08-22 09:30 GMT

బీజేపీకి కొత్త కొత్వాల్ గా వీర్రాజు వచ్చారు. ఇకనేం దూసుకుపోతుంది అని అంతా అనుకున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకుని నోటాను గెలిపించిన బీజేపీకి జవసత్వాలు నింపేందుకు వీరావేశం వీర్రాజు కరెక్ట్ సెలెక్షన్ అని కూడా అంతా అనుకున్నారు. ఆయన ఆకాశాన్ని భూమిని కలిపేస్తారని, ఏపేలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నుంచి గంపగుత్తగా పార్టీ జనం వచ్చి బీజేపీ జెండా పట్టుకుంటారని కూడా ఎన్నో ఊహించారు. తీరా చూసుకుంటే వీర్రాజు వచ్చిన తరువాత అన్నీ తీసివేతలే తప్ప కూడికలు లేవని అంటున్నారు.

వరస సస్పెన్షన్లు….

బీజేపీలో ఇప్పటికి ముగ్గురు కీలక నేతలను వీర్రాజు తన స్వహస్తాలతో సస్పెన్షన్ చేస్తూ వేటు వేశారు. వారంతా బీజేపీలో ఇప్పటిదాకా సీరియస్ గా పనిచేస్తున్న వారే. అందులో మొదటిగా వేటు పడింది అమరావతి రాజధానికి అనుకూలంగా ఒక వ్యాసం రాసిన ఓవీ రమణకు. ఆయన తిరుపతికి చెందిన సీనియర్ నేత. తన భావన‌ను చెప్పారు. అది పార్టీ స్టాండ్ కి తప్పు అనుకున్నా పిలిచి మాట్లాడాల్సింది అన్న వారూ ఉన్నారు. ఇక ఆ తరువాత వెలగపూడి గోపాలక్రిష్ణ అనే రాజధాని బీజేపీ నేతను సోము సస్పెండ్ చేశారు. ఆయన ఏకంగా రైతుల మధ్యలో దీక్ష శిబిరంలో పాలుపంచుకుని తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. పార్టీ స్టాండ్ కి భిన్నంగానే వ్యవహరించారు. ఇక ఆయన తరువాత తాజాగా మరో నేత మీద వేటు పడింది. ఆయనే అంజిబాబు. ఈయన అక్రమంగా మధ్యం తన కారులో తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఈయన 2019 ఎన్నికలో బీజేపీ తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీ గా పోటీ చేశారు. సరే ఈ ముగ్గురిలో అంజిబాబు తప్ప మిగిలిన ఇద్దరూ పార్టీ లైన్ కి కాస్తా అభిప్రాయభేదమే చూపారు. కానీ వారి మీద గొడ్డలి వేటు పడిపోయింది.

అలకల సీన్ ….

ఇక రాజసభ సభ్యుడు సుజనా చౌదరి చూసుకుంటే సోము వీర్రాజు ఇలా నియమితులు కాగానే అలా టీడీపీ స్టాండ్ రాజధాని మీద వినిపించి ఖండన మండనల‌కు గురి అయ్యారు. అంతే నాటి నుంచి ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ఇంకోవైపు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దివాకర్ కి షోకాజ్ నోటీస్ వెళ్లింది. కన్నా లక్ష్మీ నారాయణ ఉన్నపుడు కొంత యాక్టివ్ గా కనిపించిన వారంతా ఇపుడు ముసుగేశారు. ఈ నేపధ్యంలో సోము వీర్రాజు తన కంటూ బలమైన నాయకులను పార్టీ కోసం తయారు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇపుడు అంతా రివర్స్ లో ఉన్నట్లుగా బీజేపీ కధ చూస్తే అర్ధమవుతోంది.

చేరికలేవీ…?

మరో వైపు కన్నా పోయి సోము వచ్చే అన్నట్లుగా బీజేపీలో సీన్ ఉంది. బీజేపీలో చేరమని బాహాటంగా ఆహ్వానాలు లేవు కానీ తెరవెనక మాత్రం పిలుపులు వెళ్తున్నాయట. కానీ ఇతర పార్టీలకు చెందిన నేతలు మాత్రం ఆలోచించి చెబుతామని అంటున్నారుట. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని కులం పార్టీగా మార్చేందుకు సోము వీర్రాజు చూస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. పైగా పవన్, బీజేపీ పొత్తు, మెగాస్టార్ ఆశీస్సులు ఇలాంటి జిమ్మిక్కులు ఏవీ వర్కౌట్ అయినట్లుగా లేదు, మరో పార్టీలో ఉన్న వారి మీద కత్తి పెట్టి మరీ సోము వీర్రాజు వేటు వేస్తున్నారు. మరి బీజేపీ బండి ఇలాగైతే నాలుగడుగులు వెనక్కి వెళ్తుంది కానీ ముందుకు ఎలా పరిగెడుతుందని కమల నాధులు అంటున్నారు.

Tags:    

Similar News