వీరి భేటీకి రీజన్ ఇదేనా …?

ప్రస్తుతం ఏ పార్టీలో లేని చిరంజీవి ని సోము వీర్రాజు కలవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పైకి మర్యాదపూర్వకంగా కలిశామని [more]

Update: 2020-08-08 11:00 GMT

ప్రస్తుతం ఏ పార్టీలో లేని చిరంజీవి ని సోము వీర్రాజు కలవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పైకి మర్యాదపూర్వకంగా కలిశామని సోము వీర్రాజు ప్రకటించినా లోతైన వ్యూహంతోనే ఈ కలయిక అంటున్నారు. జనసేన తో కలిసి 2024 లో అధికారంలోకి బిజెపి రావాలంటే ఖచ్చితంగా చిరంజీవి ఆశీస్సులు అవసరం. దీనికి అవసరమైన సహాయ సహకారాలను సోము వీర్రాజు కోరి ఉంటారని తెలుస్తుంది. 2009 లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యత్వం పొంది కేంద్రమంత్రి అయిన చిరు రాష్ట్ర విభజన తరువాత క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటూ అక్కడ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తూ తన పెద్దరికాన్ని మెగాస్టార్ నిలబెట్టుకుంటూ వస్తున్నారు.

అన్నదమ్ములను కమలంతో కలిపేస్తారా ?

జనసేన స్థాపించినప్పుడు లేదా ఆ తరువాత ఎన్నికల్లో తమ్ముడు పవన్ కి చిరంజీవి అండగా నిలవలేదు. పికే కూడా అన్న మద్దతు కోరలేదు. అలా సాగుతున్న అన్నదమ్ముల పొలిటికల్ ప్రయాణంలో ఇప్పుడు బిజెపి సోదరుల నడుమ సఖ్యత కుదురుస్తుందా అన్న చర్చ మొదలైంది. దీనికి సోము వీర్రాజు వంటివారు మధ్యవర్తి గా ఉంటూ చిరు ను బిజెపి వైపు టర్న్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అలాగే కాపు ఓటు బ్యాంక్ గంప గుత్తగా బిజెపి, జనసేన వైపు టర్న్ కావాలంటే చిరంజీవి, ముద్రగడ వంటి వారి ఆశీస్సులు అవసరమని అంటున్నారు. ఈ దిశగా కూడా సోము వీర్రాజు తన ప్రయత్నాలు మొదలు పెట్టి ఎపి లో బిజెపి ని ప్రత్యామ్నాయ శక్తిగా మారుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.

టార్గెట్ అమల్లో పెడుతున్నారా ?

ఇక అన్నతో చర్చించాక తరువాత రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సోము వీర్రాజు కలిశారు. వరుసగా ఇద్దరితో విడి విడిగా ఆయన భేటీ కావడం విశేషమే. బిజెపి తో పొత్తులో ఉన్న జనసేన అనుసరించాలిసిన వ్యూహం పై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 2024 లో అధికారమే లక్ష్యంగా ఎదగాలన్నది సోము వీర్రాజు టార్గెట్. ఈ మేరకే ఆయన పవన్ తో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం ఎపి లో అమరావతి చుట్టూ రాజకీయం నడుస్తుంది. మూడు రాజధానుల ప్రయత్నాన్ని అడ్డుకోలేని టిడిపి తన తప్పును కమలంపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తుంది. తన మీడియా లో విస్తృతంగా కేంద్రం అడ్డుకోవాలంటూ హోరెత్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటిని సోము వీర్రాజు గట్టిగానే తిప్పికొడుతున్నారు. తమ వ్యూహం మరో ఏడాదిన్నరలో ఎపి లో అన్ని పార్టీలకు అర్ధం అవుతుందని అంటున్నారు. అదేంటో రాబోయే రోజుల్లో మీరే చూస్తారని చెబుతున్న సోము వీర్రాజు అందులో భాగంగానే మెగాస్టార్, పవర్ స్టార్ లతో విడి విడిగా కలిసినట్లు టాక్.

Tags:    

Similar News