సోముకు జగన్ చేయూత పధకం…?

ఏపీలో జగన్ పధకాలు అనేకం ఉన్నాయి. వాటిని వివిధ సామాజిక వర్గాల లబ్దిదారులకు కేటాయించారు. వాటి ఫలాలూ, ఫలితాలను రాజకీయంగా వైసీపీ భారీగానే కోరుకుంటోంది.ఈ సంగతి ఇలా [more]

Update: 2021-03-08 05:00 GMT

ఏపీలో జగన్ పధకాలు అనేకం ఉన్నాయి. వాటిని వివిధ సామాజిక వర్గాల లబ్దిదారులకు కేటాయించారు. వాటి ఫలాలూ, ఫలితాలను రాజకీయంగా వైసీపీ భారీగానే కోరుకుంటోంది.ఈ సంగతి ఇలా ఉంటే జగన్ ఏపీలోని విపక్ష నేతలలో కొందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు అని చెబుతున్నారు. అందులో సీపీఎం నుంచి మధు అలాగే ఆ పార్టీ సీనియర్ నేతలు ఉంటారు. ఇక బీజేపీలో కూడా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారి పట్ల జగన్ సానుకూలంగా ఉంటారని ప్రచారం అయితే ఉంది.

తమలపాకుతోనేనా…?

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద టీడీపీ నాయకులు తరచూ చేసే విమర్శ ఒకటి ఉంది. తమ అధినేత చంద్రబాబుని తలుపు చెక్కతో కొట్టినట్లుగా గట్టిగా కామెంట్స్ చేసే సోము జగన్ విషయంలో మాత్రం తమలపాకుతో కొట్టినట్లుగా సున్నితంగా విమర్శలు చేస్తారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వంటి వారు తరచూ అంటూంటారు. ఇక సోము వీర్రాజు కూడా రెండేళ్ళ క్రితమే కుర్చీ దిగిపోయిన చంద్రబాబుని ప్రతీ విషయంలో తీసుకొచ్చి హాట్ కామెంట్స్ ఆయన మీద చేస్తూంటారు. దీంతో చాలా మందిలో జగన్ పట్ల సోము వీర్రాజు కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి.

వర్కౌట్ అయ్యేనా …?

ఇక సోము వీర్రాజుకి రాక రాక 2015లో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ పదవీకాలం ఈ ఏడాది మధ్యలో ముగుస్తోంది. సోము వీర్రాజును బీజేపీ హై కమాండ్ సెలెక్ట్ చేసి నాటి సీఎం చంద్రబాబుని ఒప్పించి మరీ ఎమ్మెల్సీగా చేసింది. ఇపుడు చూస్తే ఏపీలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్సీలే ఉంటే అందులో సోము రిటైర్ అయితే ఒకే ఒక్కడుగా విశాఖ నుంచి పీవీఎన్ మాధవ్ మాత్రమే ఉంటారు. పైగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజుకు ఈ పదవి ఉండడం చాలా అవసరం కూడా. దాంతో జగన్ ఏమైనా చేయూతను అందిస్తారా అన్న చర్చ రెండు పార్టీలలోనూ జరుగుతోందిట.

కొత్త సమీకరణలే….?

ఇంతవరకూ ఏపీలో బీజేపీ వైసీపీల మధ్య బంధం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కాదు, తెలియదు కూడా. లోపాయికారీగా సాయాలు ఉంటే ఉండొచ్చు కానీ ఇలా బాహాటంగా మాత్రం మద్దతు ఇచ్చి పుచ్చుకోవడాలు లేవు. అయితే గత ఏడాది గుజరాత్ కి చెందిన పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానీని ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా జగన్ తో మాట్లాడి ఏపీ నుంచి రాజ్య సభకు ఎంపీగా చేసుకున్నారు. ఇపుడు అదే తరహాలో సోము వీర్రాజుని కూడా మరో సారి ఎమ్మెల్సీగా చేయమని కేంద్ర పెద్దలు అడిగితే జగన్ నో చెప్పే చాన్స్ లేదని అంటున్నారు. పైగా సోముతో జగన్ కి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల కూడా ఇది సాధ్యపడుతుంది అని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News