సోము సక్సెస్ కష్టమే.. అందుకు కారణాలివే

ఏపీలో బీజేపీ ఎద‌గాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో (ఎప్పుడు జ‌రిగినా..) అధికారంలోకి రావాలి!-ఇదీ.. ఏపీ బీజేపీ నేత ‌లక్ష్యం. పాపం ఈ దిశ‌గానే పార్టీ రాష్ట్ర చీఫ్ సోము [more]

Update: 2021-02-18 09:30 GMT

ఏపీలో బీజేపీ ఎద‌గాలి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో (ఎప్పుడు జ‌రిగినా..) అధికారంలోకి రావాలి!-ఇదీ.. ఏపీ బీజేపీ నేత ‌లక్ష్యం. పాపం ఈ దిశ‌గానే పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు శ్రమిస్తున్నారు. జిల్లాల ప‌ర్యట‌న‌ల నుంచి పార్టీని బ‌లోపేతం చేసుకునే వ‌ర‌కు ఆయ‌న బాగానే క‌ష్టప‌డుతున్నారు. ఒక‌ప్పుడు క‌ర్ణాట‌క‌లో యడ్యూర‌ప్ప (ప్ర‌స్తుత సీఎం)..కూడా ఇలానే క‌ష్టప‌డ్డారు. అయితే.. అప్పట్లో క‌ర్ణాట‌క బీజేపీ శాఖ‌కు కేంద్రంలోని బీజేపీ పెద్దలు వాజ‌పేయి వంటివారు పూర్తిగా స‌హ‌క‌రించారు. క‌ర్ణాట‌క ప్రజ‌లు కోరుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ తరహాలోనే…..

దీంతో ద‌క్షిణాది రాష్ట్రాల్లో తొలి సారి బీజేపీ క‌ర్ణాట‌క‌లో పాగా వేసి.. అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత బ‌ల‌మైన పార్టీగా ఎదిగింది. ఈ క్రమంలోనే స్థానిక ప్రాంతీయ పార్టీల‌ను సైతం కుమ్మేసింది. అలాంటి ప‌రిస్థితినే.. సోము వీర్రాజు కోరుకుంటున్నారు. “ఇప్పుడు రాష్ట్రంలో రెండు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వీటిని ఎదుర్కొని.. ఒక్కసారి క‌నుక అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి బీజేపీ ఎదిగితే.. ఇక తిరుగు ఉండ‌దు“ అని త‌ర‌చు ఆయ‌న ఏ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చినా చెబుతున్న మాట‌. బ‌హుశ .. దీనిని దృస్టిలో పెట్టుకునే సోము వీర్రాజు త‌న ప్రయ‌త్నాలు.. చేస్తున్నార‌ని చెప్పుకోవాలి.

పెద్దల నుంచి….

అయితే.. అప్పట్లో య‌డ్యూర‌ప్పకు కేంద్రంలోని పెద్దలు స‌హ‌క‌రించిన‌ట్టుగా ఇప్పుడు సోము వీర్రాజుకు మాత్రం కేంద్రంలోని పెద్దల నుంచి స‌హ‌కారం లేద‌నేది వాస్తవం. ఎందుకంటే.. ఏపీలో ఇప్పుడు ఏం జ‌ర‌గాల‌న్నా.. కేంద్రం స‌హ‌క‌రించాలి. ఇక్క‌డి బ‌ల‌మైన టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంపైనే ఆధార‌ప‌డి ఉన్నాయి. ప్రత్యేక హోదా కావొచ్చు, లేదా ప్యాకేజీ కావొచ్చు. ఇక‌, పోల‌వ‌రం నిధులు, అదేవిధంగా వెనుక‌బ‌డిన జిల్లాల నిధులు, లోటుబ‌డ్జెట్‌, విభ‌జ‌న హామీలు ఇలా.. అన్నీ కూడా కేంద్రం నుంచి ఏపీకి రావాలి. ఈ విష‌యంలో బీజేపీ నేత‌లు కేంద్రంపైనే ఆశ పెట్టుకున్నారు. అయితే.. వీటిని ఇచ్చేందుకు కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఇష్టప‌డ‌డం లేదు.

అన్నీ ప్రజా వ్యతిరేక…..

దీంతో వీటిని కూడా త‌ట్టుకుని పార్టీని ప్రజ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని అనుకుంటున్న త‌రుణంలో.. ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కు రూపంలో బీజేపీ నేత‌ల నెత్తిన పెద్ద బండ ప‌డింద‌నే కామెంట్లు ఆ పార్టీ నేత‌ల్లోనే వినిపిస్తున్నాయి. ఆంధ్రా విష‌యంలో బీజేపీ వ‌రుస చ‌ర్యలు ఆ పార్టీ ప‌ట్ల ప్రజ‌ల్లో మ‌రింత వ్యతిరేక‌త పెంచుతున్నాయి. “ఇలా ఒక్కొక్కటిగా క‌ష్టాలు ఎదుర‌వుతుంటే.. ప్రజ‌ల్లోకి ఎలా వెళ్లాలి?ఇప‌్పటికే బ‌డ్జెట్‌పై నిల‌దీస్తున్నారు. ఇప్పుడు విశాఖ ఉక్కు! మా వ‌ల్ల కావ‌డం లేదు!!“ -ఇదీ.. సోము వీర్రాజు అంత‌ర్మథ‌నం. మ‌రి కేంద్రం పెద్దల స‌హ‌కారం లేకుండా ఏపీ వంటి భిన్నమైన ఆలోచ‌న‌లు చేసే ప్రజ‌లున్న రాష్ట్రంలో ఎలా ఎదుగుతుందోన‌ని విశ్లేష‌కులు కూడా అంటున్నారు.

Tags:    

Similar News