ఔట్ డేటెడ్ నేత‌ల‌తో అంద‌లం అందేనా ?

రాష్ట్ర బీజేపీలో కీల‌క విష‌యంపై అంత‌ర్మథ‌నం జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేస్తామ‌ని.. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప‌దే ప‌దే చెబుతున్నారు. [more]

Update: 2021-01-22 00:30 GMT

రాష్ట్ర బీజేపీలో కీల‌క విష‌యంపై అంత‌ర్మథ‌నం జోరుగా సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేస్తామ‌ని.. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప‌దే ప‌దే చెబుతున్నారు. మంచిదే.. ఏ పార్టీ నేత‌కైనా ఆ మాత్రం ఆశ ఉండాల్సిందే. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టడం లేదు. అయితే.. ఇది అంత తేలిక కాద‌ని అంటున్నారు క‌మ‌లం పార్టీలోని కీల‌క నేత‌లు. దీనికి రెండు కీల‌క కార‌ణాలు చెబుతున్నారు. ఒక‌టి రాష్ట్రంలో యువ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. రెండు పార్టీలో ఔట్ డేటెడ్ నాయ‌కులు త‌ప్ప మ‌రొక‌రు పెద్దగా క‌నిపించ‌డం లేదు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌కు ప్రాధాన్యం లేనేలేదు. ఈ నేప‌థ్యంలో పార్టీ ఆశించిన మేర‌కు పుంజుకుంటుందా ? అనేది కీల‌క ప్రశ్న.

తెలంగాణాతో పోటీ…..

ప్రస్తుతం సోము వీర్రాజు దృష్టి అంతా తెలంగాణ‌పై ఉంది. అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ దూకుడుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక‌లోవిజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేసి స‌క్సె స్ అయ్యారు. అదేవిధంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ అనూహ్య రీతిలో విజ‌యం ద‌క్కించుకుని నాలుగు స్థానాల నుంచి 48 స్థానాల‌కు ఎగ‌బాకేలా పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఇక‌, దీనిని నిశితంగా గ‌మ‌నించిన సోము వీర్రాజు.. ఏపీలోనూ ఇదే మంత్రంతో ముందుకు సాగాల‌ని అనుకుంటున్నారు. ఇక వీరిద్దరు ఒకేసారి ఏపీ, తెలంగాణ‌కు అధ్యక్షులుగా నియ‌మితులు అవ్వడంతో ఇప్పుడు స‌హ‌జంగానే వీరు ఎంత మేర‌కు స‌క్సెస్ అయ్యార‌న్నదానిపై కంపేరిజ‌న్లు ఎక్కువ అయ్యాయి.

సుడిగాలి పర్యటనలు చేస్తున్నా…..

సోము వీర్రాజు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేస్తున్నారు. ప్రభుత్వంపై అందివ‌చ్చిన ప్రతి అవ‌కాశాన్నీ వినియోగించుకుని విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. అయితే తెలంగాణ‌కు, ఏపీకి మాత్రం చాలా తేడా ఉంద‌ని అంటున్నారు క‌మ‌లం పార్టీలోని మేధావులు. “అక్కడ‌కు, ఇక్కడ‌కు చాలా తేడా ఉంది. అక్కడ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వారు యువ నాయ‌కుడు.. దేనికైనా రెడీగా ఉన్నారు. యువ‌త‌ను క‌దిలించే అస్త్రాలు చాలానే ఉన్నాయి. కానీ, ఇక్కడ అలాంటి ప‌రిస్థితి లేదు. మావోళ్లు పాత నాయ‌కుల‌కు వ‌ల విసురుతున్నారే త‌ప్ప.. కొత్త యువ‌త‌ను పార్టీలో చేర్చుకునే ప్రయ‌త్నం చేయ‌డం లేదు. ఉన్న ఒక‌రిద్దరికీ కూడా అవ‌కాశం ఇవ్వలేదు. మేం మాట్లాడితే.. ఎక్కడ వాళ్లకు అడ్డం వ‌స్తామో.. అని భావిస్తున్నారు.

కలుపుకుని పోయే తత్వం….

ఇక‌, పార్టీ ఎలా అధికారంలోకి వ‌స్తుంది!!“ అంటూ.. సీమ ప్రాంతానికి చెందిన ఓ యువ నాయ‌కుడు చెప్పిన మాట ఇది. మ‌రి దీనిని బ‌ట్టి.. సోము వీర్రాజు చేస్తున్న ఔట్‌డేటెడ్ విన్యాసం.. అంద‌లం ఎలా ద‌క్కేలా చేస్తుందో చూడాల‌ని అంటున్నారు. ఇక ఏపీలో పార్టీలో చేరుతోన్న చాలా మంది సీనియ‌ర్లు, అవుట్ డేటెడ్ లీడ‌ర్లకు తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉన్నాం అని చెప్పుకునేందుకు మిన‌హా వారితో పార్టీకి ఉప‌యోగం లేదు. ఇప్పుడు అలాంటి వాళ్లే ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఇక సోము వీర్రాజులో ప్రధానంగా క‌లుపుగోలు త‌నం లేక‌పోవ‌డంతో పాటు అప్పుడే క్యాస్ట్ ముద్ర ప‌డిపోవడం కూడా మైన‌స్‌. మ‌రి వీటిని త‌ట్టుకుని సోము వీర్రాజు ఎలాంటి ఫీట్లు చేస్తారో చూడాలి.

Tags:    

Similar News