ఎందుకిలా వాయిస్ మార్చారు…. అందుకేనా?

అక‌స్మాత్తుగా ఆకాశం నుంచి రాలిప‌డ్డట్టుగా.. ఇప్పుడే.. రాజ‌ధాని ఉద్యమం గురించి తెలిసిన‌ట్టుగా.. బీజేపీ రాష్ట్ర సార‌థి.. సోము వీర్రాజు రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్యటించారు. వాస్తవానికి ఆయ‌న బీజేపీ [more]

Update: 2020-12-23 09:30 GMT

అక‌స్మాత్తుగా ఆకాశం నుంచి రాలిప‌డ్డట్టుగా.. ఇప్పుడే.. రాజ‌ధాని ఉద్యమం గురించి తెలిసిన‌ట్టుగా.. బీజేపీ రాష్ట్ర సార‌థి.. సోము వీర్రాజు రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్యటించారు. వాస్తవానికి ఆయ‌న బీజేపీ చీఫ్ అయి దాదాపు ఆరు మాసాలు అవుతోంది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న ఒక్కసారంటే ఒక్కసారి కూడా రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్యటించింది లేదు. రాజ‌ధాని ప్రాంతానికి మ‌ద్దతు ప‌లికింది కూడా లేదు. రాజ‌ధానిపై బీజేపీలో మిగిలిన నేత‌లు అమరావ‌తికి మ‌ద్దతు అంటూ అర‌చీ గీపెడుతున్నా సోము వీర్రాజు మాత్రం మౌనంగానే ఉన్నారు. కానీ, అనూహ్యంగా మాత్రం ఇప్పుడు అక్కడ‌కు వెళ్లి ఉద్యమం చేస్తున్న రైతుల‌కు పొర్లు దండాలు పెట్టినంత ప‌నిచేశారు. దీంతో రాజ‌కీయంగా సోము వీర్రాజు వ్యవ‌హారం సంచ‌ల‌నంగా మార‌డంతోపాటు.. ఆయ‌న వ్యూహానికి సంబంధించి విశ్లేష‌ణ‌లు కూడా ఊపందుకున్నాయి.

నాటి వ్యాఖ్యలకు విరుద్ధంగా…..

ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఎలాంటి వ్యాఖ్యలు చేశారో.. చూస్తే.. ఈయ‌నేంటి .. ఒక్కసారిగా ఇలా మారిపోయారు.. అని అన‌కుండా ఎవ‌రు మాత్రం ఉండ‌గ‌ల‌రు. “అమ‌రావ‌తి అనేది ఎవ‌రిని అడిగి చంద్రబాబు ఎంపిక చేశారు“-'అమ‌రావ‌తి రైతుల‌కు ఏం న‌ష్టం జ‌రిపోయింద‌ని ఉద్యమాలు చేస్తున్నారు'-'శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ ఏం చెప్పిందో.. దానికి త‌గిన విధంగా నిర్మించాల్సిన రాజ‌ధానిని చంద్రబాబు త‌న వారికోసం.. అమ‌రావ‌తిని ఎంపిక చేశారు'-'మూడు రాజ‌ధానులు మంచివే'-'నాడు చంద్రబాబు అక్కడ రాజ‌ధాని అంటే.. ఓకే అన్నాం. నేడు జ‌గ‌న్ మ‌రో చోట అంటే.. ఓకే అంటాం. ఇందులో త‌ప్పేముంది. అప్పుడు ప్రశ్నించ‌ని వారు ఇప్పుడెందుకు గుండెలు బాదుకుంటున్నారు'-.. ఇవీ ప‌లు సంద‌ర్భాల్లో సోము వీర్రాజు రాజ‌ధానిపై చేసిన వ్యాఖ్యలు.

ఇంత ప్రేమ ఎందుకో?

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆయ‌న‌కు అమాంతం రాజ‌ధానిపై సోము వీర్రాజుకు ప్రేమ పెరిగిపోయింది. రాజ‌ధానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని చెప్పడం కాదు.. ఏకంగా.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బీజేపీ వాద‌న ఇదేన‌ని చెప్పారు. పైగా తాను మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాన‌ని చెప్పుకున్నారు. స‌డెన్‌గా అమ‌రావ‌తిపై ఇంత ప్రేమ ఎందుకు పొడుచుకువ‌చ్చింది? ఒక్కసారిగా రాజ‌ధాని అమ‌రావ‌తిగానే ఉండాల‌ని ఎందుకు అనుకుంటున్నారు ? అంటే.. ఖచ్చితంగా దీని వెనుక తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక ఉంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

అందుకే ఈ ఎత్తుగడ……

తిరుప‌తి ఉప పోరులో అమ‌రావ‌తి వాదం తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తిరుప‌తి జ‌నాల‌కు విశాఖ కంటే విజ‌య‌వాడ మీదే మ‌క్కువ ఎక్కువ‌. పైగా పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో నాలుగు అసెంబ్లీ సీట్లు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ కూడా అమ‌రావ‌తి ఆలోచ‌న ఉంది. అయితే ఇది గెలుపు ఓట‌ముల‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉందా ? అన్నది సందేహ‌మే అయినా టీడీపీ అమ‌రావ‌తి వాదాన్ని ఉప ఎన్నిక‌ల్లో బాగా వాడుకునేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో కొంతైనా దీనిని త‌మ‌వైపు మ‌ళ్లించుకునేందుకు.. అమ‌రావ‌తి సెగ‌ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు సోము వీర్రాజు.. స‌హా క‌మ‌ల నాథులు చేసిన మేథో మ‌థ‌నం నుంచి వెలుగు చూసిన ఎత్తుగ‌డే అమ‌రావ‌తి వాద‌న అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని బ‌ట్టి .. బీజేపీ నేత‌ల అమ‌రావ‌తి వాద‌న‌ను న‌మ్మాలో.. లేక ఎలా ? అర్ధం చేసుకోవాలో.. అనేది రైతులు, రాజ‌ధాని మ‌హిళ‌లే నిర్ణయించుకోవాలసిన అవ‌స‌రం ఉంది.

Tags:    

Similar News