సోము చూపు విశాఖ వైపు ?

విశాఖ అందమైన నగరం. అందరూ ఇటే చూస్తారు, చూడాలి కూడా. కూల్ సిటీ. పీస్ ఫుల్ సిటీ. ఇక రాజకీయంగా కూడా పెద్దగా గొడవలూ ఘోషలూ లేని [more]

Update: 2020-09-15 15:30 GMT

విశాఖ అందమైన నగరం. అందరూ ఇటే చూస్తారు, చూడాలి కూడా. కూల్ సిటీ. పీస్ ఫుల్ సిటీ. ఇక రాజకీయంగా కూడా పెద్దగా గొడవలూ ఘోషలూ లేని నగరం. అందుకే ఇక్కడ నుంచి రాజకీయం చేయాలని అంతా భావిస్తారు. ఇదిలా ఉంటే బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ గా వచ్చిన దగ్గర నుంచి సోము వీర్రాజు విశాఖ టూర్లు ఒక్కసారిగా పెంచేశారు. ఆయన నెలల్లో ఒకటి రెండు సార్లు విశాఖ పర్యటనలు పెట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆయనది పొరుగు జిల్లా కావడం కూడా విశాఖ రావడానికి వీలుగా ఉన్నట్లు కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు వాసి. ఆయనకు విజయవాడ దగ్గర. అలా సోము వీర్రాజుకు ఏపీలో పాలనా రాజధాని కాబోతున్న విశాఖ దగ్గరగా ఉంది అంటున్నారు.

బలమున్న చోటే….

విశాఖలో బీజేపీకి బలం కొంత ఉంది. గత ఏడాది వరకూ బీజేపీ ఎంపీగా హరిబాబు ఉండేవారు. అలాగే రెండు సార్లు బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి గెలిచారు. ఇపుడు ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీగా పీవీఎన్ మాధవ్ ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీకి కొంత బలం ఉన్న నగరంగా విశాఖను చెప్పుకుంటారు. దాంతో ఇక్కడ నుంచే రాజకీయ గర్జన చేసేందుకు సోము వీర్రాజు చూస్తున్నారని అంటున్నారు. మరో వైపు బలమున్న ప్రాంతం మీద గట్టిగా ఫోకస్ చేస్తే రానున్న కాలంలో పొలిటికల్ గా ప్రయోజనం ఉంటుందని కూడా సోము వీర్రాజు అంచనా వేస్తున్నారు అంటున్నారు.

బీసీల మీద గురి ……

ఉత్తరాంధ్రా జిల్లాలు బీసీలకు పట్టుకొమ్మలు. టీడీపీ, వైసీపీలను మాత్రమే రాజకీయంగా గుర్తించి అందలం ఎక్కించిన బీసీలకు తాము కూడా బలమైన ప్రత్యామ్నాయం అని చెప్పాలన్నదే సోము వీర్రాజు ఆరాటంగా ఉంది. అంతే కాదు, ఇక్కడ టీడీపీ వేగంగా తగ్గిపోతోంది. 23 సీట్లు వచ్చిన టీడీపీకి గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బిగ్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇక్కడ ఆ ప్లేస్ లో తాము దూరాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ గా ఉందిట. ఇక టీడీపీలో అసంత్రుప్తి ఉంది. అలాగే వైసీపీలో అసమ్మతి నేతలు కూడా ఉన్నారు. ఇలా వారి మీద కన్ను వేసిన మీదటనే సోము వీర్రాజు మూడు జిల్లాల్లో తరచూ పర్యటనలు పెట్టుకున్నారు అంటున్నారు.

రాజకీయ కేంద్రమే….?

విశాఖను పాలనారాజధానిగా వైసీపీ సర్కార్ ప్రకటించింది. దాంతో అమాంతం ఈ నగరం ప్రాధాన్యత పెరిగిపోయింది. ఇక జనసేనతో బీజేపీ కూటమి కట్టింది. జనసేన గత ఎన్నికల్లో ఓడినా కూడా విశాఖ సిటీతో పాటు రూరల్ జిలాల్లో బాగానే ఓట్లు తెచ్చుకుంది. ఇలా రాజకీయ, సామాజిక సమీకరణలను వీర్రాజు బేరీజు వేసుకునే విశాఖకు గురి పెట్టారని అంటున్నారు. మరో మాట కూడా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు నుంచి బీజేపీ పోటీ చేస్తుందిట. మరి దాని మీద ఆ పార్టీలోని బిగ్ షాట్స్ ద్రుష్టి పెట్టారని అంటున్నారు. దాంతో సోము వీర్రాజు విశాఖ సిటీలో బలపడాలని చూస్తున్నారు, విశాఖ సిటీలో టీడీపీ గెలిచినా ఎమ్మెల్యేలలో నిరాశ ఉంది. వైసీపీకి నగరంలో పూర్తి స్థాయిలో బలం లేదు. అందువల్ల సోము తనదైన యాక్షన్ ప్లాన్ తో బీజేపీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావడానికి చూస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News