సోము టీం రెడీ అవుతుందట.. వారిని మాత్రం?

బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన సోము వీర్రాజు కార్యవర్గం కూర్పుపై దృష్టి పెట్టారు. త్వరలో ఆయన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకోనున్నారు. ఇందుకోసం కసరత్తులు పూర్తి చేస్తున్నారు. కార్యవర్గంలో [more]

Update: 2020-08-30 09:30 GMT

బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన సోము వీర్రాజు కార్యవర్గం కూర్పుపై దృష్టి పెట్టారు. త్వరలో ఆయన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకోనున్నారు. ఇందుకోసం కసరత్తులు పూర్తి చేస్తున్నారు. కార్యవర్గంలో అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా సోము వీర్రాజు చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా బీసీలకు ఎక్కువ శాతం మందికి కార్యవర్గంలో చోటు కల్పించాలని సోము వీర్రాజు భావిస్తున్నారు. ఈ మేరకు కొందరు సలహాలు, సూచనలు కూడా ఆయన స్వీకరిస్తున్నట్లు తెలిసింది.

సౌండ్ పెరిగినా….?

సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టిన తర్వాత బీజేపీ సౌండ్ ఏపీలో బాగానే వినపడుతుంది. ఇటు చంద్రబాబు, అటు జగన్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో అసలైన ప్రత్యామ్నాయం తామేనని సోము వీర్రాజు దూకుడుతో ముందుకు వెళుతున్నారు. అదే సమయలో తన టీం కూడా అలాగే ఉండాలని సోము వీర్రాజు భావిస్తున్నారు. ప్రస్తుతం కార్యవర్గంలో ఉన్న అనేక మందికి సోము వీర్రాజు ఉద్వాసన పలకనున్నారు.

ఇప్పటికే వేటు….

ఇప్పటికే సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనేక మంది నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రధానంగా అమరావతి రాజధాని విషయంలో ఎవరూ పార్టీ విధానాన్ని తప్పు కూడదని సోము వీర్రాజు తన సస్పెన్షన్లతో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు నోరు తెరవాలంటే భయపడిపోతున్నారు. టీవీ చర్చల్లోనూ ఆచితూచి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇలా సోమువీర్రాజు కొంత నేతలను కట్టడి చేయగలిగారు.

ఆ అజెండాతో వచ్చిన వారికి….

ఇక ఇతర పార్టీల నుంచి వచ్చి ఒకే అజెండాతో ముందుకు వెళుతున్న వారిని కూడా కట్టడి చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ కొందరు పార్టీ అధికార ప్రతినిధులుగా ఉంటూ ఒక పార్టీ అజెండాను భుజానకెత్తుకున్నట్లు గుర్తించిన సోము వీర్రాజు వారిని కూడా పదవుల నుంచి తప్పిస్తారని ప్రచారం జరగుతోంది. అందుకే రానున్న టీంలో వలసనేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని చెబుతున్నారు. మొత్తం మీద సోము వీర్రాజు తన టీంను రెడీ చేసే యత్నంలో ఉన్నారు.

Tags:    

Similar News