మోడీ బాబుల మధ్య పాత‌ చిచ్చు రగిలిస్తున్నారా?

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు నియామకం ఎందుకు జరిగింది అంటే మామూలు జనం ఏదో పార్టీని దారిన పెట్టుకుంటారు అని అనుకుంటారు. రాజకీయం తెలిసిన [more]

Update: 2020-08-27 02:00 GMT

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా సోము వీర్రాజు నియామకం ఎందుకు జరిగింది అంటే మామూలు జనం ఏదో పార్టీని దారిన పెట్టుకుంటారు అని అనుకుంటారు. రాజకీయం తెలిసిన వారు మాత్రం పక్క పార్టీకి చుక్కలు చూపించడానికేనని చెబుతారు. ఆ పక్క పార్టీలో బల్లెంలా సోము వీర్రాజు తయారయ్యారు. ఆయన నోటి వెంట బాబుని తిట్టకుండా ఒక్క మాట కూడా రావడంలేదు. టీడీపీని ఎంత వీక్ చేస్తే అదే బీజేపీకి గొప్ప టానిక్ అన్నది సోము వీర్రాజు కనుగొన్న సిధ్ధాంతం. ఆయన తొలి రోజే దీని మీద చెప్పేశారు. మా పార్టీకి ఏపీలో పాతిక శాతం ఓటు బ్యాంక్ ఉంది. అదంతా టీడీపీ పట్టుకుపోయింది. అర్జంటుగా దాన్ని వెనక్కు తెచ్చుకోవాలి. ఇదే నా యాక్షన్ ప్లాన్ అనేశారు.

మోడీకి గుర్తు వచ్చేలా….

మోడీ ఇపుడు ప్రధాని, ఆరేళ్ళుగా ఆయన పెద్ద కుర్చీలో కూర్చుని దేశాన్ని ఏలుతున్నారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పుష్కరం పాటు పనిచేసిన సంగతి గుర్తు ఉన్నా మరీ అంతగా తలచుకోరేమో. ఇక ఎపుడో 2002 లో జరిగిన గోద్రా ఘటన మోడీకి గుర్తున్నా కూడా ఇపుడు ఎక్కడా దాని మీద బయటపడరు, ఎందుకంటే అందులో ప్లస్ ల కంటే మైనస్ లు ఉన్నాయి కనుక. సరే గోద్రా ఘటన తరువాతనే మోడీ జాతీయ, అంతర్జాతీయంగా మారుమోగారు. ఇక దేశంలో యాంటీ మోడీ ఉద్యమం కూడా నాడు జరిగింది. అపుడు వాజ్ పేయి ప్రధాని, ఆయన రాజధర్మం గురించి కూడాచెప్పారు. మోడీ మీద వాజ్ పేయి అలా మండడానికి కారణం నాటి ఎన్డీయే కన్వీనర్ చంద్రబాబు అన్నది తెలిసిందే. మోడీని సీఎం కుర్చీ దిగమన్న బాబు హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేస్తానని కూడా ఆనాడు గద్దించారు. ఇపుడు అదే మోడీకి సోము వీర్రాజు మరో మారు ఫ్లాష్ బ్యాక్ చెప్పి మరీ గుర్తు చేస్తున్నారు.

మోడీని దేశం మిస్ అయ్యేలా…?

మోడీ మీద పగబట్టిన బాబు నాడు ఆయన్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేయమని బాబు డిమాండ్ చేశారని సోము వీర్రాజు గత చరిత్ర మళ్ళీ వల్లె వేస్తున్నారు. నాడు బాబు మాటే బీజేపీ విని ఉంటే మోడీని బీజేపీ నుంచి తప్పించి ఉంటే ఈ రోజు దేశానికి మంచి ప్రధాని లేకుండా పోయేవారని సోము వీర్రాజు అంటున్నారు. అలా నాటికీ నేటిలీ లింక్ పెట్టి బాబుని బాగా ఆడిపోసుకుంటున్నారు. బాబు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ని బీజేపీ చూసేసిందని కూడా అంటున్నారు.

అన్నీ గుర్తేనా …?

మోడీకి బాబు చేసిన విమర్శలు, ఆయన్ని అవమానించినది అన్నీ గుర్తేనని కూడా సోము వీర్రాజు అంటున్నారు. బాబు ఎంతలా పొగిడినా కూడా మోడీ వినరు, మొర ఆలకించరు అంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు. బీజేపీని ఎపుడూ మోసం చేసి తాను బలపడడమే కదా బాబుకు తెలిసిన విద్య అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి బాబు విషయంలో సోము వీర్రాజు ఒక రేంజిలో విరుచుకుపడుతున్నారు. అంతే కాదు, మోడీకి కూడా చెడ్డ చేస్తూ ఈనాటి జనానికి బీజేపీ తరానికి తెలిసేలా బాబు పరువు తీస్తున్నారు. సో మోడీ బాబు అసలు కలవనే కలవరు, కలిస్తే నేనూరుకుంటానా అంటున్నారు వీరావేశం వీర్రాజు. బాబుకు ఇక ఇంతే సంగతులా.

Tags:    

Similar News