తట్టుకోవాలంటే ఆయనే మరి

సోమిరెడ్డి తప్ప ఆ జిల్లాలో మరో దిక్కు లేకుండా పోయింది. అధినేత చంద్రబాబుకు కావాల్సిన నేతగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరోసారి సోమిరెడ్డి [more]

Update: 2019-11-25 13:30 GMT

సోమిరెడ్డి తప్ప ఆ జిల్లాలో మరో దిక్కు లేకుండా పోయింది. అధినేత చంద్రబాబుకు కావాల్సిన నేతగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రమాదంగా మారింది. గత ఎన్నికల్లో జీరో రిజల్ట్ రావడంతో ద్వితీయ శ్రేణినేతలందరూ అధికార పార్టీ వైపు చూస్తున్నారు. చేరిపోతున్నారు. పార్టీ జిల్లా పార్టీ కనీసం వారిని ఆపలేకపోయిందన్న అప్రప్రధను ఎదుర్కొంది.

పార్టీ అధ్యక్షుడిని మార్చాలని….

దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బీద రవిచంద్ర ఉన్నారు. బీదరవిచంద్ర 2012 నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఈయన ఎవరికీ అందుబాటులో ఉండరని, కనీసం ఫోన్ కూడా ఎత్తరన్న ఆరోపణలున్నాయి. 2014 నుంచి టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ బీద రవిచంద్ర పార్టీ కోసం చేసింది శూన్యమనే చెబుతున్నారు. ఆయన తన ఆస్తులను పెంచుకోవడానికి, కాపాడుకోవడానికే పార్టీ పదవిని అడ్డం పెట్టుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు.

సోమిరెడ్డి టైంలోనూ…..

ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరినీ ఎదగనివ్వరన్న విమర్శ ఉంది. ఎవరైనా పార్టీలో చేరాలని వచ్చినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యంతరం చెబుతారని పార్టీ నేతలే చెబుతారు. బలమైన నేతలు వస్తామని చెప్పినా సోమిరెడ్డి స్వయంగా అడ్డుకోవడం వల్లనే వారు రాలేదని ఇప్పటికీ చెబుతారు. దీంతో పాటుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ మేరకు బలోపేతం చేశారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.

వైసీపీని ఎదుర్కొనాలంటే…..

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రలు తమకు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పించాలని ఇప్పటికే చంద్రబాబు వద్ద అప్లికేషన్ పెట్టుకున్నారట. ఇటీవల చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సోమిరెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించాలని కోరినట్లు తెలిసింది. అయితే మరో సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కూడా తనను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయాలని గట్టిగానే కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అధికార పార్టీ వైసీపీని తట్టుకోవాంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీద రవిచంద్రను రాష్ట్ర కమిటీలోకి తీసుకుని, సోమిరెడ్డికి జిల్లా పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. అయితే సోమిరెడ్డి టీడీపీని జిల్లాలో ఎలా బలోపేతం చేస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News